కానిస్టేబుల్ పై అంతరాష్ట్ర దొంగ కత్తితో దాడి.. ఎక్కడంటే..?

by Naveena |

సత్తుపల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పై అంతర్రాష్ట్ర దొంగ కత్తితో దాడి చేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది.

కానిస్టేబుల్ పై అంతరాష్ట్ర దొంగ కత్తితో దాడి.. ఎక్కడంటే..?
X

దిశ,సత్తుపల్లి : సత్తుపల్లి పోలీస్ స్టేషన్ కానిస్టేబుల్ పై అంతర్రాష్ట్ర దొంగ కత్తితో దాడి చేసిన సంఘటన సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సత్తుపల్లి పోలీస్ స్టేషన్ లో ఐడి పార్టీ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న నరేష్ విధి నిర్వహణలో భాగంగా బస్టాండ్ లో ఉన్నారు. ఈ క్రమంలో ఏలూరు జిల్లా చాట్రాయి మండలం చింతాపూర్ గ్రామానికి చెందిన తిరువీధుల సురేందర్ (25) అనుమానస్పదంగా తిరుగుతున్నాడు. అయితే ఆ యువకుడిని దొంగగా గుర్తించిన కానిస్టేబుల్ పట్టుకోడానికి ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఐడి పార్టీ కానిస్టేబుల్ నరేష్ పై కత్తితో దాడి చేసి నిందితుడు పరారయ్యాడు. కానిస్టేబుల్ నరేష్ ను గుర్తించిన స్థానికులు సత్తుపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ కు నాలుగు చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. స్థానిక పోలీసులు కానిస్టేబుల్ ఆరోగ్య పరిస్థితిని ఎప్పటికప్పుడు అడిగి తెలుసుకుంటున్నారు. ఈ సంఘటనపై పట్టణ సి ఐ.టీ కిరణ్, సత్తుపల్లి ఎస్సై ఏ రఘు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Next Story