- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భద్రాచలం రామాలయంలో వినూత్న మార్పులు
భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో అన్న ప్రసాదం, లడ్డు, పులిహోర ప్రసాదాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు.

దిశ, భద్రాచలం: భద్రాచలం సీతారామచంద్రస్వామి వారి దేవస్థానంలో అన్న ప్రసాదం, లడ్డు, పులిహోర ప్రసాదాలపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. భద్రాచలం ఆర్డీఓగా సుదీర్ఘ కాలం పని చేసిన దామోదర్‌రావు, రామాలయం ఈఓగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం లడ్డూ తయారీ, అన్న ప్రసాదం తయారీ కేంద్రాలను పరిశీలించి స్వయంగా రుచి చూశారు. సంతృప్తి చెందిన తర్వాతే ఆయా ప్రసాదాలను భక్తులకు పంపిణీ చేస్తున్నారు. ఇలాగే ఎప్పటికప్పుడూ ప్రసాదాల నాణ్యత, రుచిపై భక్తుల నుంచి అభిప్రాయాలు తెలుసుకుంటూ అవసరమైన చర్యలు తీసుకుంటున్నారు. నిత్యం క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టి భక్తులకు మెరుగైన సౌకర్యాలను అందిస్తుండటంతో ఆలయానికి భక్తుల రాకతో పాటు ఆదాయమూ ఘననీయంగా పెరిగింది. గత ఏడాదికి, ఈ ఏదాడికి భద్రాద్రి వచ్చే భక్తుల సంఖ్య ఒక నెలలో 45వేలకు పెరిగింది. నూతనంగా శ్రీరామ అచ్చు ఇటుకులను తయారు చేసి భక్తులకు అందజేస్తున్నారు.
భద్రాచలం సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానంలో భక్తులకు అన్న ప్రసాదం, లడ్డు, పులిహోర లాంటి ప్రసాదాలను ఈ ఓ స్వయంగా పరిశీలించి, సంతృప్తి చెందిన తర్వాతే భక్తులకు పంపిణీ చేస్తున్నారు. అంతే కాకుండా ఎప్పటికప్పుడు ప్రసాదాల నాణ్యత, రుచిపై భక్తుల నుంచి అభిప్రాయాలు తీసుకుంటున్నారు. కార్యనిర్వాహణాధికారిగా దామోదర్‌రావు బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి భక్తుల రాకతో పాటు ఆలయానికి ఆదాయం ఘననీయంగా పెరిగింది. నిత్యం క్షేత్ర స్థాయి పరిశీలన చేపట్టి భక్తులకు మెరుగైన సౌకర్యాలను అందిస్తున్నారు.
2024 అక్టోబర్ మాసంలో భద్రాద్రి రామయ్యను 1,45,333 మంది భక్తులు దర్శించుకోగా.... ఈ సంవత్సరం అక్టోబర్ నెలలో 1,89,062 మంది భక్తులు దర్శించుకోవడం విశేషం. గత ఏడాదికి, ఈ ఏదాడికి భద్రాద్రి వచ్చే భక్తుల సంఖ్య ఒక నెలలో 45వేలకు పెరిగింది. భక్తుల రాకతో పాటు హుండీల ద్వారా భక్తులు స్వామివారికి కానుకల రూపంగా సమర్పించిన ఆదాయం పెరుగుతూ వస్తుంది. నవంబర్ 10న హుండీలు తెరవగా రూ.1,61,02,694 నగదు లభించగా, 141గ్రాముల బంగారం, 850గ్రాములు వెండి హుండీలద్వారా లభించింది. నూతనంగా శ్రీరామ అచ్చు ఇటుకులను తయారు చేసి భక్తులకు అందిస్తున్నారు. నూతనంగా భవనం నిర్మాణం చేపట్టే భక్తులు ఈ ఇటుకులను తమ భవన నిర్మాణంలో ఉపయోగిస్తే శుభప్రదం అని భావిస్తున్నారు. భద్రాచలం ఆర్డీఓగా సుదీర్ఘ కాలం పని చేసిన దామోదర్‌రావు, రామాలయం ఈఓగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టారు. శుక్రవారం లడ్డూ తయారీ, అన్న ప్రసాదం తయారీ కేంద్రాలను పరిశీలించి స్వయంగా రుచి చూశారు.






