- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నకిలీ ధృవ పత్రాలతో దర్జాగా పెన్షన్ పొందుతున్న అనర్హులు
సింగరేణి మండల పరిధిలో అన్నీ సక్రమంగానే ఉన్నా అక్రమ మార్గంలో సదరం సర్టిఫికెట్లను పొంది దర్జాగా ప్రతి నెల నెల వికలాంగుల పెన్షన్ 4016 రూపాయలు అనుభవిస్తున్నారు.

దిశ, కారేపల్లి : సింగరేణి మండల పరిధిలో అన్నీ సక్రమంగానే ఉన్నా అక్రమ మార్గంలో సదరం సర్టిఫికెట్లను పొంది దర్జాగా ప్రతి నెల నెల వికలాంగుల పెన్షన్ 4016 రూపాయలు అనుభవిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి దివ్యాంగుడికి ఆర్థిక భరోసా కల్పించాలనే లక్ష్యంతో పెన్షన్ పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న క్రమంలో ఈ పథకం అనర్హులకు వరంగా మారింది. సింగరేణి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలలో అక్రమ మార్గాన పొందిన సదరం సర్టిఫికెట్లతో పెన్షన్ పొందుతూ రాష్ట్ర ప్రభుత్వాన్ని అప్పుల పాలు చేస్తున్నారు. సంక్షేమం పేరుతో అమలవుతున్న ఈ పథకంలో అనేక అవకతవకలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలు వెలువడటం ఆందోళన కలిగిస్తోంది. సింగరేణి మండల పరిధిలో 1070 మంది వికలాంగుల పెన్షన్ పొందుతున్నారు. ఒక్కొక్కరికి 4016 చొప్పున లెక్కలేసుకుంటే సుమారు 43 లక్షల రూపాయల సొమ్ము వికలాంగుల ఖాతాల్లో జమవుతున్నది.ఈ 1070 మందిలో అసలు వికలాంగులకు దీటుగా నకిలీ వికలాంగులు కూడా వీరితో పాటే పెన్షన్ పొందుతున్నారు. వికలాంగులలో ప్రభుత్వ ఉద్యోగులు ఉండడం,వితంతువు పెన్షన్లు పొందుతున్న 300 మందిలో కూడా పలువురు ప్రభుత్వ ఉద్యోగులు పెన్షన్ పొందుతుండడం గమనార్హం.ఓ వైపు అన్ని అవయవాలు సక్రమంగానే ఉన్న వికలాంగులుగా దొంగ సర్టిఫికెట్లను పొంది రికార్డుల్లో వికలాంగులుగా చేరిపోయి ప్రభుత్వ ధనాన్ని నెలవారి పెన్షన్ రూపంలో అప్పనంగా అనుభవిస్తున్నారు.దీనితో అసలైన అర్హులైన వికలాంగులకు కొత్త పెన్షన్లు మంజూరు చేయడంలో ప్రభుత్వానికి ఆర్థిక భారం ఎదురవుతున్నది.
సదరం సర్టిఫికెట్ల జారీలో భారీ అక్రమాలు:
సదరం సర్టిఫికెట్లను జారీ చేసే క్రమంలో కొంతమంది వైద్యాధికారులు నామమాత్రపు పరీక్షలు చేసి,అన్ని సక్రమంగా ఉన్న వారిని కూడా ఉద్దేశపూర్వకంగానే వికలాంగులుగా గుర్తించి సర్టిఫికెట్లు జారీ చేశారు.ఒక్కో సర్టిఫికెట్ జారీ చేసే క్రమంలో ఎంత మొత్తంలో వారికి ముడుపులు అందాయి అనేది ఒక కోణమైతే, ప్రజల సొమ్ము దుర్వినియోగంలో ప్రముఖ పాత్ర పోషించారు.
లోతైన విచారణ జరగాలి..
పెన్షన్ల జారీలో పాల్పడుతున్న అక్రమాలపై జిల్లా యంత్రాంగం స్పందించి విచారణ చేపట్టాలి.ప్రత్యేక బృందం ద్వారా ఇప్పటికే వీరికి జారీ చేసిన సదరం సర్టిఫికెట్లను పరిశీలించి, పారదర్శకతతో కూడిన విచారణ చేసినప్పుడే క్షేత్రస్థాయిలో వికలాంగులు ఎంతమంది ఉన్నారనే అసలు లెక్క బయటపడుతుంది.ఈ క్రమంలో నకిలీ వికలాంగుల చిట్టా కూడా బయటపడి ప్రభుత్వాన్ని ఉద్దేశపూర్వకంగా మోసం చేస్తున్న వారి వివరాలు వెలుగులోకి వస్తాయి.ఈ పెన్షన్ అక్రమాలపై ఎంపీడీవో పి.శ్రీనివాసరావు వివరణ కోరగాఅంగన్వాడీ టీచర్లు,ఆర్టీసీ కండక్టర్లకు,ప్రభుత్వ ఉద్యోగులకు,రిటైర్మెంట్ ఉద్యోగులు ప్రభుత్వం జారీ చేస్తున్న ఆసరా,చేయూత పెన్షన్ పథకానికి అర్హులు కాదని అన్నారు.నకిలీ సదరం సర్టిఫికెట్లను పొంది పెన్షన్ పొందుతూ ప్రభుత్వాన్ని మోసం చేస్తున్న వారిపై విచారణ చేపడతామని తెలిపారు.






