- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఇందిరమ్మ నమూనా ఇల్లు.. నత్త నడకకు ఆనవాళ్లు
రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు నీడ కల్పించేందుకు ఇందిరమ్మ ఇల్లు పథకానికి శ్రీకారం చుట్టి లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు నమూనా ఇల్లు నిర్మాణాలను నిర్మించాలని నిర్ణయించారు.

దిశ, తల్లాడ : రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన పేదలకు నీడ కల్పించేందుకు ఇందిరమ్మ ఇల్లు పథకానికి శ్రీకారం చుట్టి లబ్ధిదారులకు అవగాహన కల్పించేందుకు నమూనా ఇల్లు నిర్మాణాలను నిర్మించాలని నిర్ణయించారు. ప్రతి మండల కేంద్రంలో రెవెన్యూ కార్యాలయం సమీపంలో వీటిని ప్రారంభించారు కానీ తల్లాడ మండలంలో ఇందిరమ్మ ఇల్లు నమూనా పనులు మాత్రం నత్తనడకకు ఆనవాలుగా మారాయి. పేదవాడికి ఒక కల ఏదైనా ఏమైనా ఉందంటే అది సొంత ఇల్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.5 లక్షల కేటాయించి నిధులతో 400 ఎస్ఎఫ్టీ విస్తీర్ణంలో ఒక పడకగది, హాలు, వంటగది, మరుగుదొడ్డి, స్నానపు గది, మెట్లు నిర్మించాలి. ఆపై రంగులు వేసి విద్యుత్ ఫ్యాన్లు ఇతర సదుపాయాలు కల్పించాలి. ప్రజలు ఇందిరమ్మ ఇల్లు నమూనాను చూసి ఇల్లు ఇలా నిర్మించుకోవాలనే అవగాహన కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి రెవెన్యూ కార్యాలయంలో ఒక నమూనాను ఇల్లు నిర్మించాలని చూడగా మండల కేంద్రంలో మాత్రం ఇందిరమ్మ ఇల్లు నమూనా పనులు నత్తనడకగా నడుస్తూ స్లాబ్ లెవల్ కి మాత్రమే వచ్చి ఆగడంతో ప్రజలకు ఒక రెవెన్యూ కార్యాలయంలోనే పనులు ఎలా ఉంటే మా పరిస్థితి ఏమిటని ప్రజలు అయోమయంలో ఉండిపోయారు.
గృహ నిర్మాణ శాఖ ఏఈ షేక్ అస్మా వివరణ.. ఇది పూర్తిగా కాంట్రాక్టర్ లోపం
ఇందిరమ్మ ఇల్లు నమూనా నిర్మాణాన్ని రెవెన్యూ కార్యాలయంలో చేపట్టాం. ప్రభుత్వం కేటాయించిన స్థలంలో ఒక చెట్టు ఉండడంతో దానిని తొలగించే క్రమంలో ఫారెస్ట్ అధికారుల నుంచి పర్మిషన్ తీసుకోవడానికి కొంత సమయం పట్టడం వాస్తవమే. అలాగే కాంట్రాక్టర్ పనులు డీలే చేయడం ద్వారా ఇందిరమ్మ నమూనా ఇల్లును పూర్తి చేయకపోవడం వారికి ఫోన్లో చేసిన స్పందించకపోవడం ఒకవేళ ఫోన్ చేసిన స్పందించి మాకు ధర్నా నడుస్తుంది అని, అందుకే పూర్తి చేయలేకపోతున్నాం అని రకరకాల కారణాలు చెప్పడంతో పాటు ఈరోజు కూడా ఫోన్ చేశాను. కానీ లిఫ్ట్ చేయలేదు అందుకే ఇది పూర్తిగా కాంట్రాక్టర్ లోపం అని తెలియజేస్తున్న. అలాగే మేము ఈ సమస్య పై ఉన్నతాధికారులకి దృష్టికి తీసుకెళ్తాం. ఇందిరమ్మ ఇల్లు నమూనాను పూర్తి చేస్తాం.






