చెట్టు కొమ్మలతో ఆదాయం...కిలో ఎంతంటే

by velandi.Saikiran |

చెట్ల కొమ్మలు నిరుద్యోగులకు ఆదాయం ఇస్తున్నాయి. రహదారుల వెంట దురిసేన (దరిసేన)ను పోలి ఉండే నిద్ర గన్నేరు

చెట్టు కొమ్మలతో ఆదాయం...కిలో ఎంతంటే
X

దిశ, తల్లాడ: చెట్ల కొమ్మలు నిరుద్యోగులకు ఆదాయం ఇస్తున్నాయి. రహదారుల వెంట దురిసేన (దరిసేన)ను పోలి ఉండే నిద్ర గన్నేరు (రెయిన్ ట్రీ) చెట్లు ఏపుగా పెరుగుతూ కనిపిస్తున్నాయి. వాటి కొమ్మలపై పురుగులు సంచారం కారణంగా జిగురు నుంచి ఓ రకమైన తెల్లటి విసర్జీతాలు విడుదలవుతాయి. కొమ్మలపైన అవి గట్టి పడతాయి. నిజామాబాద్ కు చెందిన కొందరు యువకులు ఉపాధి అన్వేషణలో భాగంగా పలు ప్రాంతాలలో ఈ జిగురు పుల్లలు సేకరిస్తున్నారు. అనంతరం ఓ చోట కూర్చొని జిగురు ఉన్నంత వరకు నరికి వాటిని చిన్న ముక్కలుగా చేస్తున్నారు. వీటిని ఉప‌యోగించి, రంగులు తయారు చేస్తారట‌. మనం రోజు వాడే పాలిక్ తయారీ వీటిని ఉప‌యోగిస్తార‌ట‌. దీంతో పాలిష్ తయారు చేసే సంస్థలకు కిలోలకు రూ.150 నుంచి రూ180 వరకు విక్రయిస్తామని చెబుతున్నారు. తల్లాడ పట్నంలో ఇలా జిగురు కొమ్మలను వేరు చేస్తుండగా "దిశ న్యూస్"పలకరించింది. ఈ విషయ వృక్ష శాస్త్ర అధ్యాపకులు మాట్లాడుతూ ఆఫ్రికా దేశాలకు చెందిన రెయిన్ ట్రీ శాస్త్రీయ నామం సమానంగా సమన్ చెట్లు వేగంగా పెరుగుతాయని తెలిపారు. వాటిపై జిగురు కొందరు రోగనిరోధక ఔషధాలలో వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు.

రవీంద్ర సింగ్, నిజామాబాద్...

చెట్లు కొమ్మలపై కొన్ని కీటక జాతులు వీటిపై విసర్జిస్తాయి. అవి తెల్లటి పొరలాగా పేరుకుపోయి గట్టి ముద్దులాగా తయారవుతాయి. వాటిని మేము గమనించి చెట్ల పైకి ఎక్కి కొమ్ములను కిందకు పడేస్తాము. అనంతరం వాటిని చిన్న ముక్కలుగా చేసి పొడి లాగా తయారు చేస్తాము. అనంతరం షూ పాలిష్ కంపెనీలకు, లిప్స్టిక్ కంపెనీలకు విక్రయిస్తాము. దాదాపు మాకు రోజువారి కూలీ పడుతుంది.దీంతో మా జీవన భృతి సాగుతుందని తెలిపారు.

Next Story