పాల్వంచకు అక్రమ సీతారామ మట్టి మోత..!

by Nallavelli.Anjaneyulu |

దిశ, పాల్వంచ : పాల్వంచ ప‌ట్ట‌ణానికి సీతారామ ప్రాజెక్ట్ ప‌రిధి నుంచి అక్ర‌మ మ‌ట్టి ర‌వాణా హ‌ద్దులు దాటింది. ప్రభుత్వ

పాల్వంచకు అక్రమ సీతారామ మట్టి మోత..!
X

దిశ, పాల్వంచ : పాల్వంచ ప‌ట్ట‌ణానికి సీతారామ ప్రాజెక్ట్ ప‌రిధి నుంచి అక్ర‌మ మ‌ట‌టి ర‌వాణా హ‌ద్దులు దాటింది. ప్రభుత్వ నిబంధనలు, అనుమతులు అన్నీ పక్కనపెట్టి వేల సంఖ్యలో లారీల మట్టిని తరలిస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. సంబంధిత అధికారులే స్పష్టంగా చెబుతున్నట్లుగా ఆదివారాల్లో మట్టి రవాణాకు ఎలాంటి అనుమతులు ఉండవు. అయినా ఆ రోజే భారీ స్థాయిలో లారీలు రహదారులపై తిరుగుతూ మట్టిని పాల్వంచ వైపు తరలించడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. నిబంధనలు మాకు వర్తించవన్నట్టుగా లారీ యజమానులు విచ్చలవిడిగా తోలకాలు జరుపుతుంటే.. పట్టించుకోవాల్సిన అధికారులు మాత్రం కళ్లకు కట్టుకున్నట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు.


ఈ అక్రమ రవాణా అంతా అధికారులకు భారీ ముడుపులు అందుతున్నాయనే కారణంతోనే జరుగుతోందని స్థానికులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. అధికారుల మౌనం ఈ ఆరోపణలకు బలం చేకూరుస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అక్రమ మట్టి తరలింపుతో పర్యావరణం దెబ్బతింటోందని, రహదారులు ధ్వంసమవుతున్నాయని, ధూళి కాలుష్యంతో ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని వాపోతున్నారు. ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకోకపోవడం వెనుక ఎవరి అండదండలు ఉన్నాయన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్‌, గనుల శాఖ, రెవెన్యూ అధికారులు స్పందించి అక్రమ మట్టి రవాణాను వెంటనే నిలిపివేయాలని, బాధ్యులపై కేసులు నమోదు చేసి, లారీలు సీజ్ చేయాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

అనుమ‌తులు ఇవ్వ‌లేదు : ఇరిగేష‌న్ సీఈ శ్రీనివాస్ రెడ్డి

ఈ మధ్యకాలంలో అనుమతులు ఇచ్చినట్టు నా దృష్టిలో లేదు. ఆదివారం అనుమతులు ఉండవు నేను వెంటనే మా జెఈ కి సమాచారం అందిస్తాన‌ని తెలిపారు.

Next Story