డీలక్స్ బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వాలని హల్చల్

by velandi.Saikiran |

డీలక్స్ బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వాలని మహిళ ఆందోళన చేసిన ఘటన మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగింది.

డీలక్స్ బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వాలని హల్చల్
X

దిశ, కొత్తగూడెం: డీలక్స్ బస్సులో ఫ్రీ టికెట్ ఇవ్వాలని మహిళ ఆందోళన చేసిన ఘటన మంగళవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో జరిగింది. లక్ష్మీదేవి పల్లి మండలం శేషగిరి నగర్ కి చెందిన ఓ మహిళ ఖమ్మం వెళ్లేందుకు కొత్తగూడెం బస్టాండ్ లో డీలక్స్ బస్సు ఎక్కింది. డీలక్స్ బస్సులో ఆధార్ కార్డు చూయించి ఫ్రీ టికెట్ ఇవ్వమని కండక్టర్ ని కోరింది. దీంతో ఇది ఫ్రీ బస్సు కాదని డీలక్స్ బస్సులో ఆధార్ కార్డుతో ఫ్రీ టికెట్ ఇవ్వడం కుదరదని కండక్టర్ చెప్పాడు. దీంతో కండ‌క్ట‌ర్ తో వాగ్వాదానికి దిగింది స‌ద‌రు మ‌హిళ‌. చుంచుపల్లి మండలం వద్ద ఆ మహిళను బస్సు దించి వేశాడు కండక్టర్. దీంతో ఆగ్రహించిన మహిళ... బస్సు ముందు పడుకొని ఆందోళన చేసింది. తోటి ప్రయాణికులు చెప్పినా వినకుండా బస్సు కదలనిచ్చేది లేదని భీష్మించుకొని కూర్చుంది. బస్ కండక్టర్.... పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. అనంత‌రం మహిళకు నచ్చచెప్పి పంపించి వేశారు.

Next Story