- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బయటపడిన మావోయిస్టుల భారీ డంప్..
by Kodari Anjali |
మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు జవాన్లు బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడ్మా గ్రామం దట్టమైన అడవుల్లో సోదాలు నిర్వహించారు.

X
దిశ, భద్రాచలం: దంతెవాడ జిల్లాలో లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకు జవాన్లు బర్సూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని తోడ్మా గ్రామం దట్టమైన అడవుల్లో సోదాలు నిర్వహించారు. ఈ సెర్చ్ ఆపరేషన్‌లో భారీ డంప్ లభ్యం అయ్యింది. నగదు, బంగారం, ఆయుధాలు, పేలుడు పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. డంప్‌లో 116 గ్రాముల బంగారు బిస్కెట్లు ఉన్నాయి. వీటి ధర రూ.16 లక్షలు ఉంటుందని, రూ.2 లక్షలు నగదు, ఇది కాకుండా ఒక ఇన్సాస్ రైఫిల్, నాలుగు ఏకే -47 రైఫిల్స్, ఐదు 12 బోర్ గన్లు, మూడు BGL లాంచర్లు, ఆరు టిఫిన్ బాంబులు, 122 బాణం బాంబులు, నాలుగు పైపు బాంబులు, కంట్రీ గ్రెనేడ్, మోర్టార్, జెలటిన్, డిటోనేటర్లు, రివాల్వర్లు, ఎయిర్ గన్లు, లోడ్ చేసిన తుపాకులు లభించినట్లు పోలీస్ అధికారులు తెలిపారు.
Next Story






