ఖమ్మం దాబాల్లో ఘోరం.. పురుగులు పట్టిన చికెన్ కుళ్లిన కోడిగుడ్లు!

by Malleboina Mahesh |

ఖమ్మం ఏదులాపురం పరిధిలోని రమేశ్ దాబాలో చికెన్ కర్రీలో బల్లి రావడంతో కస్టమర్ షాకయ్యాడు. దాబాలో పురుగులు పట్టిన చికెన్‌ను సీజ్ చేశారు.

ఖమ్మం దాబాల్లో ఘోరం.. పురుగులు పట్టిన చికెన్ కుళ్లిన కోడిగుడ్లు!
X

దిశ, ఖమ్మం రూరల్: ఏదులాపురం మున్సిపాలిటీ పరిధిలోని కోదాడ క్రాస్ రోడ్ వద్ద ఉన్న రమేశ్ దాబాలో వ్యక్తి తాను ఆర్డర్ చేసిన చికెన్ కర్రీలో బల్లి కనిపించడంతో ఒక్కసారిగా కంగుతిన్నాడు. వెంటనే నిర్వాహకులను ప్రశ్నించగా నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాబాలో కుళ్లిన చికెన్, పాడైన మాంసం నిల్వ ఉంచినట్లు గుర్తించినట్లు సమాచారం. వంటగది పరిసరాలు అపరిశుభ్రంగా ఉండటంతో పాటు ఆహార పదార్థాల నాణ్యత పై ఎలాంటి నిఘా లేదని అధికారులు గుర్తించారు.

పురుగు పట్టిన చికెన్..

చికెన్ కర్రీలో బల్లి వచ్చిందనే సమాచారంతో ‘ దిశ’ విలేకరి సంబంధిత దాబాను పరిశీలించగా పలు ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి. దాబాలో కళ్లెదురుగానే పురుగు పట్టిన చికెన్, కూళ్లిన కోడిగుడ్లు కనిపించాయి. ఇదేంటని అడిగితే నిర్వహకుల వద్ద సమాధానం లేదు. పొంతనలేని సమాధానం ఇచ్చేందుకు ప్రయత్నించారు. వీటితో పాటు మిగిలిన ఫుడ్ ఐటమ్స్ ఫ్రిడ్జ్‌లో ఉంచి విక్రయిస్తున్నారు.

దాబాల్లో ఇది మాములే..

రూరల్ మండలం, ఏదులాపురం మున్సిపల్ పరిధిలో నిర్వహిస్తున్న పలు దాబాలో నాసిరకమైన ఫుడ్‌పై పలుమార్లు ఘర్షణలు జరగడం, ఫుడ్లో పురుగులు, బల్లులు వచ్చిన ఫిర్యాదులు చేసిన సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. టెస్టింగ్ సాల్ట్ వేసి తిండి ప్రియులు ను కట్టడి చేస్తున్నారు. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న ఆహార భద్రత అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదని విమర్శలు ఉన్నాయి. సంబంధిత అధికారులకు నెలవారి మాముళ్లు ఇస్తుండటంతోనే ఎవరైనా ఫిర్యాదులు చేస్తే కనీసం పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. దాబాల్లో కల్తీ ఆహారం విక్రయం జరుగుతున్నా.. సంబంధిత అధికారులు సరైన పర్యవేక్షణ చేయడం లేదని ఆరోపిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారులు తరచూ తనిఖీలు నిర్వహించి ప్రజలకు నాణ్యమైన ఆహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

పరిశీలించి క్రిమినల్ కేసులు పెడుతాం

రమేష్ దాబాలో ఫుడ్ తింటుంటే బల్లి వచ్చిందని మాకు కూడా తెలిసింది. సంబంధిత దాబాను పరిశీలించి నాణ్యత ప్రమాణాలు పాటించిన నిర్వాహకులపై క్రిమినల్ కేసులు పెడుతాం.- లోకేష్, ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ఖమ్మం

Next Story