ఇల్లెందును హీటెక్కిస్తున్న 'హిట్ ఫీవర్స్'

by Ratna Kumari |

వేసవి కాలంలో ప్రజలు హిట్ ఫీ వర్స్, టైఫాయిడ్ జ్వరాల నుంచి విముక్తి పొందేందుకు వేసవిలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా పరిసరాల పరిశుభ్రత నిత్యం చేతులను శుభ్రం చేసుకోవడం వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని DCHO రవిబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

ఇల్లెందును హీటెక్కిస్తున్న హిట్ ఫీవర్స్
X

దిశ, ఇల్లెందు : వేసవి కాలంలో ప్రజలు హిట్ ఫీ వర్స్, టైఫాయిడ్ జ్వరాల నుంచి విముక్తి పొందేందుకు వేసవిలో అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా పరిసరాల పరిశుభ్రత నిత్యం చేతులను శుభ్రం చేసుకోవడం వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని DCHO రవిబాబు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఇల్లెందు ప్రభుత్వ వైద్యశాలను ఆయన క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్యశాలలో చేపడుతున్న పరిశుద్ధ పనులను, వందలాదిగా వస్తున్న రోగులను పరిశీలిస్తు అందిస్తున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. వైద్యశాలలోని ప్రతి విభాగాన్ని నేరుగా పరిశీలించి అందులోని సమస్యలను గుర్తించారు. ముఖ్యంగా వేసవికాలం కావడంతో వార్డులలో రోగులకు సరైన గాలి లేకపోవడంతో వెంటనే చల్లదనాన్ని ఇచ్చే కూలర్లను ఏర్పాటు చేయాలన్నారు. కిటికీలకు డోర్లకు కర్టెన్స్ ను సిద్ధం చేయాలని సూచించారు.

బర్త్ వెయిటింగ్, పీడియాట్రి క్ రూమ్స్ లో ఏసీలు ఏర్పాటు చేసే వరకు కూలర్లను బిగించాలన్నారు. వైద్యశాలను పారిశుధ్య లోపం లేకుండా సిబ్బంది ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలని ఆదేశించారు. వైద్యశాలకు వచ్చే రోగులకు వారి సహాయకులకు వేసవికాలం కావడం వల్ల త్రాగునీటిని అందుబాటులో ఉంచాలని సూచించారు. ఇల్లెందు తో పాటు మణుగూరు చెర్ల పాల్వంచ మండలాలకు రోగుల అవసరాల దృష్ట్యా అంబులెన్స్ ల‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నట్లు త్వరలోనే అంబులెన్స్ ఏర్పాటుకు జిల్లా ఉన్నతాధికారులతో స్థానిక ఎమ్మెల్యేలు మంత్రులను కలిసి సమస్య పరిష్కారానికి కృషి చేస్తారని తెలిపారు. ఇల్లెందు వైద్యశాలలో ఇన్సులిన్ పాన్ టాప్ ఇంజక్షన్ల కొరత ఉందని త్వరలోనే పరిష్కరిస్తామన్నారు అప్పటివరకు స్టాక్ ఉన్న వైద్యశాల నుంచి తెప్పించి తాత్కాలిక కొరతను తీరుస్తామని స్పష్టం చేశారు. వైద్యశాలలో రోగుల సహాయకుల కోసం నిర్మించాల్సిన‌ షెడ్లకు సంబంధించి గుత్తేదారులు ముందుకు రావట్లేదని అందుకు సంబంధించి సమస్య పరిష్కారానికి షెడ్ల నిర్మాణానికి టెండర్లు త్వరలోనే నిర్వహించి పూర్తి చేస్తామన్నారు. ఇల్లందు వైద్యశాలకు కాయకల్ప అవార్డు కోసం కృషి చేస్తున్నామని తెలిపారు. డీసీహెచ్ఓ రవిబాబుతో పాటు ఇల్లందు వైద్యశాల సూప‌రింటెండెంట్ డాక్టర్ హర్షవర్ధన్, వైద్యులు బన్సీలాల్, శేఖర్ పాల్గొన్నారు.

Next Story