హైటెక్ స్మగ్లింగ్...కారు ఇంజిన్ లో గంజాయి

by velandi.Saikiran |

హైటెక్ స్మగ్లింగ్...కారు ఇంజిన్ లో గంజాయి కారులో తరలిస్తుండగా పట్టుబడిన రు 26 లక్షల గంజాయి

హైటెక్ స్మగ్లింగ్...కారు ఇంజిన్ లో గంజాయి
X

దిశ, భద్రాచలం: కారు ఇంజిన్ లో ఏకంగా రు. 26 లక్షల గంజాయి ఒడిస్సా నుంచి కేరళకు తరలిస్తూ భద్రాచలం వద్ద పట్టుబడ్డారు. ఎన్ఫోర్స్మెంట్ ఎస్ఐ శ్రీహరి రావు ఆధ్వర్యంలో సిబ్బంది పట్టణంలోని కూనవరం రోడ్ లో వాహనాలు తనిఖీ చేస్తుండగా, అనుమానస్పదంగా వస్తున్న కారును తనిఖీ చేశారు. కారు మొత్తం పరిశీలించినా ఫలితం లేకపోవడంతో చివరిగా బాయినెట్ తెరిచి చూసి ఆశ్చర్యపోయారు. ఇంజిన్ పక్కన ఉన్న ఖాళీ ప్రదేశంలో 51.9 కేజీల గంజాయి పట్టుబడింది.

దీని విలువ రు. 26 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ కేసులో కేరళకు చెందిన జకారియా పర్యాల్, నశిర పూర్తియా వెట్టల్ అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కారు, గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గంజాయి తరలిస్తున్న కారుకు ఎస్కార్ట్ గా సూర్యాపేటకు చెందిన రవి అనే వ్యక్తి, అధికారులను చూసి బైక్ అక్కడే వదిలి పరారయ్యాడు. బైక్ స్వాధీనం చేసుకుని రవిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎక్సైజ్ ఖమ్మం ఏసి గణేష్ పేర్కొన్నారు.

Next Story