- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ హీరో
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ హీరో తనీష్ స్పందించారు. కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో జనసేన పార్టీ తరఫున నిర్వహించిన ‘గడప గడపకు జనసేన’ కార్యక్రమం ప్రజల నుంచి వచ్చిన అపూర్వ స్పందనతో ఘనంగా సాగింది.

*తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ హీరో*
*కల్లూరు లో ప్రచారంలో సందడి చేసిన హీరో తనీష్*
*15వ వార్డులో జనసేనకు అపూర్వ స్పందన*
దిశ, కల్లూరు : తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో టాలీవుడ్ హీరో తనీష్ స్పందించారు. కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని 15వ వార్డులో జనసేన పార్టీ తరఫున నిర్వహించిన ‘గడప గడపకు జనసేన’ కార్యక్రమం ప్రజల నుంచి వచ్చిన అపూర్వ స్పందనతో ఘనంగా సాగింది. ఈ ప్రచారంలో స్టార్ క్యాంపెయినర్ హీరో తనీష్ అల్లాడి పాల్గొనడంతో కార్యక్రమానికి మరింత ఊపు వచ్చింది.
15వ వార్డు జనసేన అభ్యర్థి జిల్లేళ్ళ దుర్గా అనూష మహేష్ ఇంటింటా తిరుగుతూ ప్రజల సమస్యలను విని, వార్డు అభివృద్ధి కోసం అంకితభావంతో పనిచేస్తానని హామీ ఇచ్చారు. ఆమె సాదాసీదా తీరుతో ప్రజల మనసు గెలుచుకుంటూ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. స్టార్ క్యాంపెయినర్ తనీష్ అల్లాడి మాట్లాడుతూ,
“జిల్లేళ్ళ దుర్గా అనూష మహేష్ గెలిస్తే 15వ వార్డు అభివృద్ధికి నా పూర్తి సహకారం ఉంటుంది. ప్రజల అవసరాల కోసం ఎప్పుడూ అందుబాటులో ఉంటాం” అని హామీ ఇచ్చారు.ప్రజల నుంచి వచ్చిన ఉత్సాహభరిత స్పందనతో ‘జనసేన విజయం ఖాయం’ అనే ధీమాను నాయకులు, కార్యకర్తలు వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో ఖమ్మం జిల్లా జనసేన పార్టీ ఇన్‌చార్జి మిరియాల రామకృష్ణ, నాయకులు బండి నరేష్, రాజేష్, బండారు రామకృష్ణ, హసీనా, పాషా, శివాజి తో పాటు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు, మహిళలు పాల్గొని ప్రచారాన్ని విజయవంతం చేశారు.






