- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైరాలో వర్ష బీభత్సం.. 11.4 సెంటీమీటర్లు నమోదు
వైరా మండలంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

దిశ, వైరా: వైరా మండలంలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుండటంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బుధవారం ఉదయం 8 గంటల నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు వైరా మండలంలో 11.4 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో మధ్యతరహకు చెందిన వైరా రిజర్వాయర్ నీటిమట్టం గురువారం సాయంత్రానికి 20 అడుగులకు చేరుకుంది. బుధవారం ఉదయం నుంచి గురువారం సాయంత్రం వరకు రిజర్వాయర్ నీటిమట్టం 1.5 అడుగులు పెరిగింది. వైరా మండలంలోని స్నానాల లక్ష్మీపురం గ్రామంలో వైరా నదిపై ఉన్న లో లెవెల్ వంతెన పైనుంచి వరద నీరు భారీ స్థాయిలో ప్రవహిస్తుంది. దీంతో సిరిపురం - లక్ష్మీపురం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. వైరా నది, గంగదేవిపాడు వాగుతో పాటు మండలంలోని పలు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
వరద బాధితులను పునరావాస కేంద్రానికి తరలింపు
వైరా మున్సిపాలిటీ పరిధిలోని వరద బాధిత కుటుంబాలను అధికారులు పునరావాస కేంద్రానికి తరలించారు. వైరా రిజర్వాయర్ పరిసర ప్రాంతంలోని రాజీవ్ కాలనీలోకి వరద నీరు వచ్చి చేరింది. సుమారు ఎనిమిది ఇళ్లను వరద నీరు చుట్టుముట్టింది. అదేవిధంగా సోమవారం నల్లచెరువు అలుగు వాగు ఉదృతంగా ప్రవహించటంతో 5 ఇళ్లలోకి వరద నీరు వచ్చి చేరింది. దీంతో అప్రమత్తమైన వైరా మున్సిపాలిటీ కమిషనర్ యు.గురులింగం, వైరా తహసిల్దార్ కె.వి శ్రీనివాసరావు, వైరా ఎస్ఐ పుష్పాల రామారావు ఆ ప్రాంతాలను గురువారం ఉదయం పరిశీలించారు. వరద ముంపుకు గురైన సుమారు 13 బాధిత కుటుంబాలను వైరాలోని ప్రభుత్వ బాలిక ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రం కు అధికారులు తరలించారు. వల్లాపురం గ్రామంలో అమరావతి హైవే నిర్మాణ పనుల కార్మికులు వరద ముంపుకు చిక్కుకోవడంతో వారిని తహసిల్దార్ కె.వి శ్రీనివాసరావు సిబ్బందితో సురక్షిత ప్రాంతాలకు తరలించారు.






