- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సమన్వయ సమావేశంలో తీవ్ర వాగ్వాదం.. కుర్చీలు విరగ్గొట్టిన కార్యకర్తలు
బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం రసబసగా జరిగింది.

దిశ, కొత్తగూడెం ప్రతినిధి: బీఆర్ఎస్ పార్టీ అధ్వర్యంలో కొత్తగూడెం క్లబ్‌లో నిర్వహించిన ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమం రసబసగా జరిగింది. జిల్లా ఇంచార్జి తక్కెళ్లపల్లి రవీందర్ రావు మాట్లాడుతూ, రానున్నది బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వమే అని పార్టీనీ నమ్ముకున్న వాళ్ళకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని కార్యకర్తలు భరోసా ఇచ్చారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వర రావు తనయుడు వనమా రాఘవను ఉద్దేశించి మంచి భవిష్యత్ ఉందని, ఓటర్ ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని సూచించారు. కార్యకర్తలను వేధించవద్దని, బెదిరించవద్దని, బ్లాక్ మెయిల్ చేయవద్దని అధినాయకత్వం అంత గమనిస్తుందన్నారు. సర్ విషయంలో కష్టపడితే పార్టీ సస్పెన్షన్ ఎత్తివేయిస్తానని హామీ ఇచ్చారు. దీనిని అవమానభారంగా భావించిన వనమా రాఘవ వేదిక పై నుండి వెళ్ళిపోయారు. ఈ సందర్భంగా ఆయన అనుచరులు నినాదాలు చేస్తూ కుర్చీలు విరగొట్టి కొంత సేపు హాల్ చల్ చేశారు. ఇంచార్జితో వాగ్వాదానికి దిగారు. కొంతసేపు ఏం జరుగుతుందో అర్థంకాక కార్యకర్తలు ఆందోళన చెందారు. దీంతో సమావేశం పట్టు తప్పుతుందని గ్రహించిన రాజ్య సభ సభ్యులు వద్దీరాజు రవిచంద్ర కార్యకర్తలను సముదాయించి, సమన్వయం చేసి శాంతింపజేశారు. దీంతో మళ్ళీ యధావిధిగా సమావేశం కొనసాగించారు.






