- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
28 ఏళ్ల తర్వాత తల్లిదండ్రుల చెంతకు...!
తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి పారిపోయిన కుర్రాడు, 28 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన సంఘటన మండలంలో

దిశ, టేకులపల్లి: తల్లిదండ్రులు మందలించారని ఇంటి నుంచి పారిపోయిన కుర్రాడు, 28 ఏళ్ల తర్వాత తిరిగి వచ్చిన సంఘటన మండలంలో చోటుచేసుకుంది. మంగళ్ తండాకు చెందిన లాకావత్ పంతులు నాతి దంపతుల రెండో కుమారుడైన హరి, 1997లో ఆరో తరగతి పూర్తి చేసుకుని వేసవి సెలవుల్లో తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. ఆ సమయంలో తల్లిదండ్రులు మందలించడంతో భయపడి ఇంటి నుంచి పారిపోయాడు హరి.
అనంతరం కొత్తగూడెం, భద్రాచలం, ఖమ్మం, కోదాడ ప్రాంతాలలో హోటల్లో పనిచేసి చివరకు హైదరాబాద్ చేరాడు. బేగంపేటలో ఓ ఇల్లు అద్దెకు తీసుకొని ఉంటూ హోటల్లో పనిచేస్తూ జీవనం సాగించాడు. 2010లో ఓ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం హరికి ఒక పాప, ఒక బాబు ఉన్నారు. తల్లిదండ్రులను చూడాలని వాళ్లతో గడపాలని ఆశ కలగడంతో రెండు రోజుల క్రితమే స్వగ్రామమైన మంగళ్ తండాకు వచ్చాడు. తల్లిదండ్రులు, తోడబుట్టిన వాళ్లను కలుసుకున్నాడు. వారితో ప్రేమ అనుబంధాలను పంచుకున్నాడు.






