- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నేలకొరిగిన మొక్కజొన్న.. కల్లాల్లో తడిచిన మిర్చి
వేసవి కాలం ప్రారంభంలో అకాల వర్షం కురవడంతో రైతులను నిండా ముంచింది. మొక్కజొన్న నేలకొరిగింది. కూలీలతో కోయించి కల్లాలో ఆరబోసిన మిర్చి తడిసిపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

దిశ, కొణిజర్ల : వేసవి కాలం ప్రారంభంలో అకాల వర్షం కురవడంతో రైతులను నిండా ముంచింది. సోమవారం రాత్రి భారీగా గాలి దూరంతో కూడిన వర్షం కురిసింది. ఊహించని విధంగా ఒకేసారి గాలి దుమారం రావడంతో తేరుకునే లోపే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. పది నుంచి పదిహేను రోజుల లోపు కోతకు వచ్చే దశలో ఉన్న మొక్కజొన్న నేలకొరిగింది. కూలీలతో కోయించి కల్లాలో ఆరబోసిన మిర్చి తడిసిపోవటంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. పల్లిపాడు, చిన్న మునగాల, పెద్ద మునగాల, కాచారం, పెద్దగా గోపతి తదితర గ్రామాల్లో మొక్కజొన్న వేలాది ఎకరాల్లో మొక్కజొన్న పైరు నేలకొరిగింది. కల్లాల్లో ఆరబోసి ఉన్న లక్షలాది రూపాయల విలువ చేసే మిర్చి తడిపోవడంతో రైతులు కన్నీటి పర్యంతమౌతున్నారు. ప్రభుత్వ స్పందించి ఆదుకోవాలని రైతులు వేడుకుంటున్నారు. దెబ్బతిన్న పంటలను మండల వ్యవసాయ అధికారి బాలాజీ మంగళవారం పరిశీలించారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున కల్లాల్లో మిర్చి ఆరబోసిన రైతులు టార్పాలిన్ పట్టాలను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు.






