ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి

by Naveena |

త్తుపల్లి మండలంలో వరి కోతల ప్రారంభమైన నేపథ్యంలో రైతుల సౌకర్యార్థం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మండల ప్రత్యేక అధికారి టి సునీల్ రెడ్డి ఆదేశించారు.

ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి
X

దిశ,సత్తుపల్లి: సత్తుపల్లి మండలంలో వరి కోతల ప్రారంభమైన నేపథ్యంలో రైతుల సౌకర్యార్థం ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని మండల ప్రత్యేక అధికారి టి సునీల్ రెడ్డి ఆదేశించారు. బుధవారం ధాన్యం కొనుగోలు అంశంపై సత్తుపల్లి మండల పరిషత్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఈనెల 29 లోపు మండలం లో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తూ, అట్టి కొనుగోలు కేంద్రాలలో వేసవి ని దృష్టిలో ఉంచుకొని కుర్చీలు, టెంటు మంచినీరు, వంటి మౌలిక వసతులు కల్పించాలని అధికారులకు ఆదేశించారు, ఈ కార్యక్రమంలో తాసిల్దార్ యోగేశ్వరరావు, మండల పరిషత్ అభివృద్ధి అధికారి, ఆర్ చిన్న నాగేశ్వరరావు, మండల వ్యవసాయ అధికారి, వై శ్రీనివాసరావు, వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ ఈఓ సాంబశివరావు ఐకెపి, ఏపియం సహకార సంఘం సీఈవోలు వ్యవసాయ విస్తరణ అధికారులు, ఐకెపి సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.

Next Story