తెలంగాణలో పాలన పారదర్శకంగా ఉండాలి

by Elthuri vijay kumar |

ఎందరో ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు.

తెలంగాణలో పాలన పారదర్శకంగా ఉండాలి
X

తెలంగాణలో పాలన పారదర్శకంగా ఉండాలి

-పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు.

దిశ, మణుగూరు: ఎందరో ప్రాణ త్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో పాలన పారదర్శకంగా ఉండాలని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అన్నారు. ఆయన బుధవారం మణుగూరు మండలంలోని ప్రజాభవన్ (ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం)లో నిర్వహించిన తెలంగాణ ప్రజా పరిపాలన దినోత్సవ కార్యక్రమంలో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణకు స్వేచ్ఛను ప్రసాదించడంలో మన స్ఫూర్తి నాటి సాయుధ పోరాటమేనన్నారు. ఏళ్ల తరబడి నిజాం పాలనలో ఉన్న తెలంగాణ నిరంకుశత్వాన్ని తెంచుకుని అఖండ భారత దేశంలో కలిసిన రోజన్నారు. మా ఆలోచన, మా ఆచరణ ప్రతీది ప్రజా కోణమేనని అందుకే ఈ శుభ దినాన్ని ప్రజా పాలన దినోత్సవంగా అధికారికంగా నిర్వహిస్తున్నామన్నారు. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా సెప్టెంబర్‌ 17ను రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పీరినాకి నవీన్, టౌన్ అధ్యక్షులు శివ సైదులు, మహిళా అధ్యక్షురాలు సౌజన్య, కూచిపూడి బాబు, రహీంపాష, సురేష్, అబ్దుల్లా, మానస, ఆదిలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Next Story