- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Godavari floods : రెండవ ప్రమాద హెచ్చరికకు చేరువలో గోదావరి..
బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.

X
దిశ, భద్రాచలం: బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడటంతో ఉభయ తెలుగు రాష్ట్రాలలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తుంది. శుక్రవారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి 43 అడుగులకు చేరుకున్న గోదావరి, శనివారం ఉదయం 9 గంటలకు 46.60 అడుగులకు పెరిగింది. 48 అడుగులకు చేరుకుంటే అధికారులు రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తారు. ఇదిలా ఉండగా చర్ల మండలంలోని తాలిపేరు ప్రాజెక్ట్ 20 గేట్లు ఓపెన్ చేసి 37,175 క్యూసెక్కుల వరద నీటిని దిగువనున్న గోదావరిలోకి వదిలారు. కిన్నెరసాని ప్రాజెక్ట్ 3 గేట్లు ఎత్తి 15 వేల క్యూసెక్కుల నీటిని దిగువనున్న కిన్నెరసాని నదిలోకి వదిలారు. గోదావరి పెరగడంతో భద్రాచలం నుండి చర్ల వెళ్లే ప్రధాన రహదారి బుర్ర వేముల, తూరుబాక వద్ద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
- Tags
- godavari floods
Next Story






