ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం

by velandi.Saikiran |

అన్ శక్తి నగర్ లో ప్రశాంత్ కుమార్, మల్లేష్ అనే ఇద్దరు తండ్రి, కొడుకుల ఆత్మహత్య యత్నం చేశారు.

ఉద్యోగాల పేరుతో ఘరానా మోసం
X

దిశ, అశ్వాపురం: అన్ శక్తి నగర్ లో ప్రశాంత్ కుమార్, మల్లేష్ అనే ఇద్దరు తండ్రి, కొడుకుల ఆత్మహత్య యత్నం చేశారు. అశ్వాపురం మండలంలో హెవీ వాటర్ ప్లాంట్ లో ఉద్యోగం ఇప్పిస్తానని , సెంట్రల్ గవర్నమెంట్ హెవీ వాటర్ ప్లాంట్ లో ఉద్యోగం చేస్తున్న వ్యక్తులు 2024 డిసెంబర్ లో 7 లక్షలు తీసుకుని మోసం చేశారట‌. దీంతో ఉద్వేగానికి గురై, మోసం చేసిన వారి ఇంటి ముందు పెట్రోల్ పట్టుకొని కూర్చున్నారు మ‌ల్లేష్, ప్ర‌శాంత్. బాధితులు ఇల్లందు పట్టణ వాసులుగా తెలిసింది. ఇక అశ్వాపురం పోలీసులు ఈ సంఘ‌ట‌న‌పై విచార‌ణ చేస్తున్నారు. దీనిపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Next Story