- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చింతకానిలో ఘరానా మోసం.. ఫోన్‌పే చేసినట్లు నమ్మించి నగదుతో పరార్
ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో ఓ వ్యక్తి చాకచక్యంగా ఫోన్‌పే చేసినట్లు నమ్మించి నగదును తీసుకుని పరార్ అయ్యాడు.

దిశ, చింతకాని: ఖమ్మం జిల్లా చింతకాని మండల కేంద్రంలో ఓ వ్యక్తి చాకచక్యంగా ఫోన్‌పే చేసినట్లు నమ్మించి నగదును తీసుకుని పరారైన ఘటన స్థానికంగా చర్చనీయాంశమైంది. వివరాల్లోకి వెళితే, చింతకాని మండల కేంద్రంలోని జలకం నాగేశ్వరరావు గోల్డ్ షాప్‌కు వచ్చిన ఓ వ్యక్తి తన వద్ద నగదు లేదని, రూ.1,000ను ఫోన్‌పే ద్వారా పంపిస్తానని దుకాణ యజమానిని నమ్మించాడు. అనంతరం మొబైల్‌లో చెల్లింపు జరిగినట్లు చూపించి, రూ.1,000 నగదు తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు. కొంతసేపటి తర్వాత ఖాతాను పరిశీలించగా.. మనీ జమ కాలేదని గుర్తించిన బాధితుడు మోసపోయినట్లు తెలుసుకున్నాడు. దీంతో ఈ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. డిజిటల్ చెల్లింపుల విషయంలో వ్యాపారులు కేవలం కస్టమర్ చూపించే స్క్రీన్‌ను మాత్రమే నమ్మకుండా, తమ బ్యాంక్ ఖాతా లేదా అధికారిక యాప్‌లో నగదు జమ అయినట్లు నిర్ధారించుకున్న తర్వాతే నగదు లేదా వస్తువులను ఇవ్వాలని స్థానికులు సూచిస్తున్నారు.






