​బూర్గంపాడులో గంజాయి పట్టివేత.. బైక్‌పై తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్

by Taduka Kalyani |

ద్విచక్రవాహనంపై అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను మంగళవారం సాయంత్రం బూర్గంపాడు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు.

​బూర్గంపాడులో గంజాయి పట్టివేత.. బైక్‌పై తరలిస్తున్న ఇద్దరి అరెస్ట్
X

దిశ,​బూర్గంపాడు : ద్విచక్రవాహనంపై అక్రమంగా గంజాయిని తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను మంగళవారం సాయంత్రం బూర్గంపాడు పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఎస్సై మేడా ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. ఒడిస్సా రాష్ట్రం నుండి ములుగు జిల్లా మంగపేటకు బజాజ్ పల్సర్ బైక్‌పై కొందరు అక్రమంగా గంజాయిని రవాణా చేస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ​​ఈ సమాచారం మేరకు పోలీసులు సారపాక పల్లె ప్రకృతి వనం వద్ద నిఘా పెట్టారు. ఆ సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన ఒక పల్సర్ వాహనాన్ని ఆపి తనిఖీ చేయగా,అందులో అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టుబడింది. గంజాయి రవాణా చేస్తున్న ములుగు జిల్లా మంగపేటకు చెందిన బడే భరత్,ఉప్పరపల్లి వెంకటేష్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.​ వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్న 2.1 కిలోల గంజాయి విలువ మార్కెట్లో సుమారు రూ.1.5 లక్షలు ఉంటుందని ఎస్సై వెల్లడించారు. గంజాయితో పాటు రవాణాకు ఉపయోగించిన బజాజ్ పల్సర్ ద్విచక్రవాహనం, రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన ఇద్దరు నిందితులపై కేసు నమోదు చేసి,వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఎస్సై మేడా ప్రసాద్ తెలిపారు.

Next Story