కుర్నవల్లిలో విషాదం.. డెంగ్యూతో వ్యక్తి మృతి

by Taduka Kalyani |

మండల పరిధిలోని కుర్నవల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి డెంగ్యూ వ్యాధితో మృతి చెందాడు.

కుర్నవల్లిలో విషాదం.. డెంగ్యూతో వ్యక్తి మృతి
X

దిశ, తల్లాడ: మండల పరిధిలోని కుర్నవల్లి గ్రామానికి చెందిన ఓ వ్యక్తి డెంగ్యూ వ్యాధితో మృతి చెందాడు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పాగా జోజి (45) గత కొన్ని రోజులుగా లివర్ ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో మే 18న శరీరం వాపు రావడంతో ఖమ్మంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స కోసం చేర్పించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అయితే చికిత్స పొందుతున్న సమయంలో ఆయనకు డెంగ్యూ వ్యాధి కూడా సోకినట్లు వైద్యులు నిర్ధారించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం జోజి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆయన మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Next Story