రామాలయంలో భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ

by Jakkula.Mamatha |

వేసవికాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది.

రామాలయంలో భక్తులకు ఉచిత మజ్జిగ పంపిణీ
X

దిశ, భద్రాచలం: వేసవికాలం ప్రారంభమవుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యార్థం భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి దేవస్థానం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. ఆలయానికి పెద్ద సంఖ్యలో వచ్చే భక్తులకు ఎండ తీవ్రత నుంచి ఉపశమనం కలిగించేందుకు ఆలయ పరిసర ప్రాంతంలో ఉచిత మజ్జిగ వితరణ కార్యక్రమాన్ని ఆదివారం ఈ ఓ దామోదర్ రావు ప్రారంభించారు. భక్తులకు తాగునీరు, మజ్జిగ వంటి సౌకర్యాలు కల్పించడం ద్వారా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటున్నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఈ ఉచిత మజ్జిగ వేసవి కాలం మొత్తం భక్తులకు నిరంతరం అందించనున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తులు ఈ సదుపాయాన్ని వినియోగించుకోవాలని దేవస్థానం అధికారులు సూచించారు.

Next Story