- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
భారీ ఎన్‌కౌంటర్.. నలుగురు మావోయిస్టులు మృతి
ఛత్తీస్‌గఢ్ నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

X
దిశ, భద్రాచలం: ఛత్తీస్‌గఢ్, నారాయణపూర్ జిల్లాలో భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మృతి చెందిన వారిలో మావోయిస్టు పార్టీకి చెందిన అగ్ర నాయకులు ఉన్నట్లు సమాచారం. మరికొంత మంది మావోయిస్టులు ఎదురు కాల్పులలో తీవ్ర గాయాలతో తప్పించుకున్నారు. తప్పించుకున్న మావోయిస్టుల ఆచూకీ కోసం భద్రతా బలగాలు గాలిస్తున్నారు. ప్రస్తుతానికి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. సంఘటన స్థలం నుంచి భారీగా ఆయుధాలు, పేలుడు సామాగ్రి లభ్యమయ్యాయి. ఈ ఎన్‌కౌంటర్‌పై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
Next Story






