- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ప్రశ్నిస్తే హింసను ప్రేరేపిస్తున్న సీఎం: మాజీ మంత్రి పువ్వాడ
చంద్రబాబుకు ఉన్న నీటిసోయి రేవంత్‌కు లేదని మాజీ మంత్రి పువ్వాడ ఆరోపించారు.

దిశ, ఖమ్మం బ్యూరో: ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తే సీఎం రేవంత్ రెడ్డి ఫ్రస్ట్రషన్ కు గురిఅవుతున్నారని, హింసను ప్రేరేపించేలా మాట్లాడుతున్నారని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో ఆ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు రేగా కాంతారావుతో కలిసి మాట్లాడారు. ఎల్నినో ప్రభావంతో కరువు వస్తుందని మాట్లాడితే రక్తంతో పంటలు పండించాలని సీఎం మాట్లాడం విడ్డూరంగా ఉందన్నారు. వానాకాలంలో రైతుబంధు ఎగ్గొట్టారని, ఆరు సీజన్లలో మూడు సీజన్ల రైతుబంధు వేయలేదని, షాపులో దొరికే యూరియా యాప్ లో పెట్టి రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు.
సీతారామ కోసం 100 కోట్లు ఖర్చు పెట్టలేదు..
బీఆర్ఎస్ ప్రభుత్వం సీతారామ ప్రాజెక్టు కోసం 9 వేల కోట్లు ఖర్చు చేసిందని, కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్లలో కనీసం 100 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని, ఎంత ఖర్చు పెట్టారో, ఎన్ని నిధులు విడుదల చేశారో చెప్పాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రేవంత్‌రెడ్డికి ఫ్రస్ట్రేషన్ పీక్స్‌కు చేరిందని నాటి సమైక్య పాలకుల వలె తెలంగాణకు అన్యాయం చేస్తూ పరిపాలిస్తున్నారని, పరిపాలనలో కాంగ్రెస్ పార్టీ అట్టర్ ఫ్లాప్ అయిందన్నారు. రైతులకు 24 గంటలు కేసిఆర్ ఇచ్చిన ఉచిత విద్యుత్తును ఎత్తేయడానికి కొత్త డిస్కంను ప్రభుత్వం తీసుకొచ్చిందని విమర్శించారు.పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో భద్రాచలం మునిగిపోయే ప్రమాదం ఉందని కాళేశ్వరం వల్ల కాదనే విషయాన్ని రేవంత్ రెడ్డి గ్రహించాలని అన్నారు. తెలంగాణ నీటిని సద్వినియోగం చేసుకోవడంలో రేవంత్ ప్రభుత్వం విఫలమైందని తెలంగాణ నుంచి దిగువకు పోతున్న నీటిని ఆంధ్రప్రదేశ్ లో పట్టిసీమతో చంద్రబాబు కృష్ణా డెల్టాకు తరలిస్తున్నారని గురువుకు ఉన్న సోయి చూసి తెలంగాణలో నీటిని వాడుకునే సోయిలోకి రేవంత్ రెడ్డి రావాలని తెలంగాణ రైతులు, ప్రజల ప్రయోజనాలపై దృష్టి సారించాలని అన్నారు. తెలంగాణ ప్రజలకు రైతులకు అన్యాయం చేయవద్దని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ డిమాండ్ చేశారు.






