beat officer attack on tourists : పర్యాటకులపై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాడి

by Sridhar Babu |   (  Updated:2024-07-18 12:31:40  IST  )

కిన్నెరసానికి చెందిన వైల్డ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పర్యాటకులపై దాడికి తెగబడ్డాడు.

beat officer attack on tourists : పర్యాటకులపై ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ దాడి
X

దిశ, పాల్వంచ : కిన్నెరసానికి చెందిన వైల్డ్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ పర్యాటకులపై దాడికి తెగబడ్డాడు. బుధవారం జరిగిన ఈ సంఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పాల్వంచ కిన్నెరసాని పర్యాటక కేంద్రం కావడంతో సందర్శించడానికి పర్యాటకులు రాకపోకలు సాగిస్తుంటారు. పర్యాటకులు తెలిపిన వివరాల ప్రకారం...

బుధవారం కిన్నెరసాని డ్యామ్ ను సందర్శించడానికి కొత్తగూడెంకు చెందిన ఐదుగురు యువకులు వెళ్తుండగా ఎంట్రీ టికెట్లు తీసుకునే విషయంలో బీట్ ఆఫీసర్ కు పర్యాటకులకు మధ్య వివాదం తలెత్తింది. దీంతో కోపోద్రిక్తుడైన బీట్ ఆఫీసర్ పర్యాటకులను విచక్షణ రహితంగా లాఠీతో కొట్టినట్లు తెలుస్తుంది. పర్యాటకులు, బీట్ ఆఫీసర్ పరస్పరం పాల్వంచ రూరల్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Next Story