లాభసాటి పంటల సాగు దిశగా దృష్టి సారించాలి

by Elthuri vijay kumar |

లాభసాటి పంటలైన ఆయిల్ పామ్ పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు.

లాభసాటి పంటల సాగు దిశగా దృష్టి సారించాలి
X

లాభసాటి పంటల సాగు దిశగా దృష్టి సారించాలి

- రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావు..

- గుడిసెల్లో ఉండే నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తాం..

- మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు

దిశ, ఖమ్మం : లాభసాటి పంటలైన ఆయిల్ పామ్ పంటల సాగు దిశగా రైతులు దృష్టి సారించాలని రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, చేనేత జౌళి శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వర రావు అన్నారు. రఘునాథపాలెం మండలం లచ్చిరాం తండా గ్రామంలో సోమవారం మంత్రి పర్యటించి, 2.15 కోట్ల రూపాయలతో లచ్చిరాం తాండ నుండి ఈర్లపూడి వరకు బీటీ రోడ్డు మరమ్మత్తు నిర్మాణం, 80 లక్షల రూపాయలతో లచ్చిరాం తండా నుండి దోనబండ మధ్య వంతెన నిర్మాణ పనులకు అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ... ఖమ్మం నియోజకవర్గ గ్రామాలకు అవసరమైన అభివృద్ధి పనులు ప్రణాళికాబద్ధంగా చేపడుతున్నట్లు తెలిపారు. రైతులు పామాయిల్, వక్క వంటి పంటలు సాగు చేసుకోవాలని వీటికి మిర్చి, పత్తి, కూరగాయలు వంటి అంతర పంటలు వేసుకోవచ్చని అన్నారు. పామాయిల్ సాగు చేస్తే ఎకరానికి 50 వేల రూపాయల సబ్సిడీ ప్రభుత్వం అందిస్తుందని అన్నారు. మొక్కలకు, అంతర్ పంటలకు, డ్రిప్ ఏర్పాటుకు సబ్సిడీ అందిస్తామని అన్నారు. పామాయిల్ పంట సాగు చేస్తే ఎకరానికి 2 లక్షల వరకు సంపాదించే అవకాశం ఉంటుందని అన్నారు. వేసవి కాలంలో కూడా రఘునాధపాలెం మండలంలో చెరువుల నింపే బాధ్యత తీసుకుంటానని, మంచి లాభ సాటి పంటలు రైతులు సాగు చేయాలని మంత్రి అన్నారు. గుడిసెల్లో ఉంటున్న నిరుపేదలకు మొదటి విడతలో ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చామని, రెండో విడతలో రేకుల ఇండ్లలో ఉంటున్న వారికి, మూడవ విడతలో ఇండ్లు లేని వారికి ఇందిరమ్మ ఇండ్లు ఇస్తామని, అర్హులైన ప్రతిఒక్కరికి ఇందిరమ్మ ఇళ్ళు ఇవ్వనున్నట్లు, ఎవ్వరు ఆందోళన చెందవద్దని మంత్రి తెలిపారు. గ్రామంలో విద్యుత్ లైన్ల షిప్టింగ్ కు అవకాశాలు పరిశీలించాలని మంత్రి విద్యుత్ అధికారులను ఆదేశించారు. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో మట్టి కి ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటూ, ఆర్వోఏఫార్ పట్టాలు పొందిన వారిని అధికారులు ఇబ్బంది పెట్టొదన్నారు. అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ... పామాయిల్ సాగులో ఖమ్మం జిల్లాను ముందంజలో ఉంచేందుకు నిరంతరాయంగా మంత్రివర్యులు కృషి చేస్తున్నారని అన్నారు. మంత్రి, రైతులకు చేస్తున్న మార్గదర్శనంను సద్వినియోగం చేసుకొని అభివృద్ధి చెందాలన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, ఖమ్మం మార్కెట్ కమిటీ చైర్మన్ హన్మంత రావు, జిల్లా వ్యవసాయ అధికారి పుల్లయ్య, పీఆర్ ఇఇ మహేష్ బాబు, విద్యుత్ శాఖ డిఇ రామారావు, రఘునాథపాలెం మండల తహసీల్దార్ శ్వేత, అధికారులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Next Story