బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం

by Disha Web Desk 11 |
బాధిత కుటుంబానికి రూ.10 వేల ఆర్థిక సాయం
X

దిశ, బూర్గంపాడు : ఆపదలో ఉన్న వారికి తన వంతు సాయం చేయడంలో ఎప్పుడూ ముందు ఉండే బూర్గంపాడుకు చెందిన బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల అధ్యక్షుడు గోనెల నాని మరోసారి ఆర్థిక సాయం జేసి మానవత్వాన్ని చాటుకున్నారు. బూర్గంపాడుకు చెందిన చెక్కా శ్రీకాంత్ కు ఇటీవల ద్విచక్ర వాహనం ఢీకొని ప్రమాదం జరగడంతో కుటుంబ పోషణ కష్టంగా మారింది. ఆ కుటుంబం ఆర్ధికంగా అవస్థ పడుతున్నారని తెలుసుకున్న గోనెల నాని తన వంతు సహాయ సహకారాలు అందించాలనే ఉద్దేశ్యంతో ఆదివారం చెక్కా శ్రీకాంత్ కుటుంబాన్ని పరామర్శించి రూ.10 వేలు ఆర్థిక సాయం అందజేశారు. ఆపదలో ఆదుకున్న గోనెల నానికి చెక్కా శ్రీకాంత్ కుటుంబసభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ యువజన విభాగం మండల ప్రధాన కార్యదర్శి ఎడమకంటి సుధాకర్ రెడ్డి, మండల ప్రచార కార్యదర్శి తోకల సతీష్, బిఆర్ఎస్ రెడ్డిపాలెం యూత్ జాయింట్ సెక్రెటరీ సుధాకర్, ఐనపాక ప్రసాద్, మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు మందా ప్రసాద్, ప్రవీణ్ ఖాదర్,బిఆర్ఎస్ గ్రామ కమిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed