- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నాలుగు నెలల తర్వాత ఎట్టకేలకు రెగ్యులర్ ఏసీపీ
నాలుగు నెలల వ్యవధి తర్వాత ఎట్టకేలకు వైరాకు రెగ్యులర్ ఏసీబీ పోస్ట్ భర్తీ అయింది. వైరాలోని ఏసీపీ కార్యాలయంలో వైరా ఏసీపీగా సాదుల సారంగపాణి బుధవారం బాధ్యతలు చేపట్టారు.

దిశ, వైరా: నాలుగు నెలల వ్యవధి తర్వాత ఎట్టకేలకు వైరాకు రెగ్యులర్ ఏసీబీ పోస్ట్ భర్తీ అయింది. వైరాలోని ఏసీపీ కార్యాలయంలో వైరా ఏసీపీగా సాదుల సారంగపాణి బుధవారం బాధ్యతలు చేపట్టారు. గత ఏడాది సెప్టెంబర్ 30వ తేదీ వరకు వైరా ఏసీపీగా బాధ్యతలు నిర్వహించిన రెహమాన్ ఉద్యోగ విరమణ పొందారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కల్లూరు ఏసీపీలు రఘు, వసుంధర యాదవ్ వైరా ఇన్చార్జి ఏసీపీ లుగా బాధ్యతలు నిర్వహించారు. రెండు రోజుల క్రితం ఇల్లందు డిఎస్పీగా నియమితులైన సారంగపాణిని అనూహ్యంగా వైరా ఏసీపీగా నియమిస్తూ సోమవారం డీజీపీ ఉత్తర్వులు జారీ చేశారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఏసీపీ సారంగపాణి మాట్లాడుతూ వైరా సబ్ డివిజన్ లో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానని చెప్పారు. ప్రధానంగా మున్సిపాలిటీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామని వివరించారు. వైరా, మధిర మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఏసీపీ సారంగపాణిని వైరా సీఐ వెంకట ప్రసాద్, ఎస్ఐ పుష్పాల రామారావు బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.






