సాదాబైనామా చట్టాన్ని మారిస్తే రైతులకు ప్రయోజనం : భూమి సునీల్

by Chintha Aamani |

తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతులు భూ సమస్యలను పరిష్కరించేందుకు ఓ పటిష్ఠమైన చట్టాన్ని తీసుకవచ్చిందని అదే ‘ భూ భారతి చట్టం’ అని ఇది రైతులకు ఒక వరంలాంటిదని భూభారతి చట్ట రూపకర్త, లీప్​ సంస్థ​ ఆర్గనైజర్​ భూమి సునీల్​ అన్నారు.

సాదాబైనామా చట్టాన్ని మారిస్తే రైతులకు ప్రయోజనం : భూమి సునీల్
X

దిశ, ఖమ్మం రూరల్​ : తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతులు భూ సమస్యలను పరిష్కరించేందుకు ఓ పటిష్ఠమైన చట్టాన్ని తీసుకవచ్చిందని అదే ‘ భూ భారతి చట్టం’ అని ఇది రైతులకు ఒక వరంలాంటిదని భూభారతి చట్ట రూపకర్త, లీప్​ సంస్థ​ ఆర్గనైజర్​ భూమి సునీల్​ అన్నారు. ఎమ్మార్వో పిల్లి రాంప్రసాద్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శుక్రవారం రూరల్​ మండలం తల్లంపాడు రెవెన్యూ గ్రామంలో ‘సాగు న్యాయ యాత్ర’ లో భాగంఆ ఆయన క్షేత్రస్థాయిలో పర్యటించి పొన్నేకల్లు రైతు వేదికలో రైతులతో సమావేశమయ్యారు. అనంతరం రూరల్​ మండల తహసీల్దార్​ కార్యాలయాన్ని విజిట్​ చేశారు. ఎమ్మార్వో పిల్లి రాంప్రసాద్ ను వివరాలు అడిగి తెలుసుకున్నారు.భూ భారతిలో వచ్చిన దరఖాస్తులను ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. రైతులు దుక్కి దున్నే నాటి నుండి పండించిన పంటను మార్కెట్లో అమ్మే దాకా రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. భూమి, వ్యవసాయం, ఆహారానికి సంబంధించి రాష్ట్రంలో రెండు వందలకు పైగా చట్టాలు వచ్చాయన్నారు.

స్వాధీనంలో భూమి, చేతిలో పట్టాదారు పాసుపుస్తకం భూభారతిలో ఉంటేనే భూమి హక్కుకు భద్రత ఉంటుందన్నారు. రైతులు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు రశీదు, కొన్ని విత్తనాలను భద్రపరుచు కోవాలన్నారు. పంట దిగుబడి సరిగ్గా రాకపోతే వినియోగదారుల పోరం ద్వారా రైతులకు న్యాయం జరుగుతుందన్నారు. ములుగు జిల్లాలో మొక్కజొన్న పంటలో దిగుబడి రాకపోవడంతో వ్యవసాయ కమిషన్​ ద్వారా ఆ రైతుకు 4 కోట్ల నష్టపరిహారం ఇప్పించిన్నట్లు ఆయన తెలిపారు. రైతులు చట్టాల గురించి అవగతం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. నేను కూడా వ్యవసాయ కమిషన్​ సభ్యుడిగా ఉన్నానని నూతన విత్తన చట్టాన్ని త్వరలో తీసుకరాబోతున్నట్లు ఆయన తెలిపారు. రెవెన్యూలో మంత్రి పొంగులేటి, వ్యవసాయ శాఖలో తుమ్మల నాగేశ్వర్​రావులు మంత్రులుగా ఉండటం వలన చట్టాల రూపకల్పనం ఈజీగా జరుగుతోందని వీరికి రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నట్టు ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకోని రైతులు సైతం ఇప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

సాదాబైనామా చట్టాన్ని మారిస్తే రైతులకు ప్రయోజనం..

సాదాబైనామా చట్టాన్ని మారిస్తేనే రైతులకు ప్రయోజనం చేకూరుతుందని భూమి సునీల్​ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో సాదాబైనామాల విషయం హైకోర్టులో ఉందని కోర్టు నిర్ణయం అనంతరం సాదాబైనమాల పై మార్పులు ఉంటాయన్నారు. ఈ చట్టాన్ని మార్చాల్సిన ఆవశ్యకత రాష్ట్రంలో ఉందన్నారు. రాష్ట్రంలో 11894 రెవెన్యూ గ్రామాలు ఉండగా 400 రెవెన్యూ గ్రామాల్లో సర్వే చేపట్టడం జరిగిందన్నారు. పైలట్​ ప్రాజెక్టు కింద సర్వే జరుగుతున్నట్లు తెలిపారు. లైసెన్స్​డ్​ సర్వేయర్లకు ట్రైనింగ్​ ముగిసిందని వారిని త్వరలో విధుల్లోకి తీసుకోవడం జరుగుతుందన్నారు. భూ భారతిలో లైసెన్సడ్​ సర్వేయర్ల పాత్ర కీలకం ఉంటుందన్నారు. క్రయ విక్రయాలకు ముందు సర్వే పటం ద్వారా రిజిస్ట్రేషన్​లు ఉంటాయన్నారు. దీంతో రైతుల సమస్యలకు చెక్​ పడుతుందన్నారు. ఈ తరహా విధానం కర్ణాటక రాష్ట్రంలో అమలు అవుతుందన్నారు. అక్కడ ఈ విధానం ద్వారా రైతులకు సత్​ఫలితాలు వచ్చినట్లు ఆయన తెలిపారు. రూరల్​ మండలంలో మొత్తం 2743 దరఖాస్తులు రాగా వాటిలో 1625 సాదాబైనామా లో ఉన్నాయన్నారు.

పదివేల ‘దిశ’ కథన పత్రికలు పంపిణీ..

దిశ దినపత్రికలో భూభారతి చట్ట రూపకర్త, లీప్​ సంస్థ​ ఆర్గనైజర్​ భూమి సునీల్ ఇచ్చిన ఇంటర్వ్యూ తో పాటు చట్ట​ అమలు తీరు తెన్నుల పై వచ్చిన శీర్షికలతో కూడిన 10వేల ‘దిశ’ దినపత్రికలను ​పంపిణీ చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగుతున్న ఈ యాత్రలో రైతులకు, అధికారులకు కరపత్రాలను అందజేస్తున్నారు. దిశలో వచ్చిన కథనాన్ని పలువురు ఆసక్తిగా చదవడంతో పాటు చర్చించుకోవడం జరిగింది.

Next Story