కదం తొక్కిన వ్యవసాయ కార్మికులు

by velandi.Saikiran |

ఖమ్మంలో వ్యవసాయ కార్మికులు కదం తొక్కారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మహాత్మాగాంధీ గ్రామీణ

కదం తొక్కిన వ్యవసాయ కార్మికులు
X

దిశ, ఖమ్మం టౌన్ : ఖమ్మంలో వ్యవసాయ కార్మికులు కదం తొక్కారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకంలో తెచ్చిన సవరణలను తక్షణం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ తెలంగాణవ్యవసాయ కార్మిక సంఘం ( సి.పి.ఐ అనుబంధం) సోమవారం ఖమ్మంలో భారీ ప్రదర్శన నిర్వహించారు. ఎన్.ఆర్. గార్డెన్ సమీపం నుంచి కలెక్టరేట్ వరకు జిల్లా నలుమూలల నుంచి వచ్చిన వ్యవసాయ కార్మికులు ప్రదర్శన నిర్వహించారు. ప్రదర్శన అగ్రభాగన సి.పి.ఐజాతీయ సమితిసభ్యులు బాగం హేమంతరావు, జిల్లా కార్యదర్శి దండి సురేష్, సహాయకార్యదర్శిజమ్ము ల జితేందర్రెడ్డి, వ్యవసాయ కార్మికసంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తాటి వెంకటేశ్వరరావు, సిద్దినేని కర్ణకుమార్ తదితరులు నడవగా కలెక్టరేట్ సమీపంలోని వైరా రోడ్ నినాదాలతో హెూరెత్తింది. అసరా ఫించన్లను పెంపుదల చేయాలని వ్యవసాయ కార్మికులకు ఇందిరమ్మ ఆత్మీయ బరోసాను అమలుచేయాలని, అర్హులందరికీ ఇందిరమ్మఇళ్ళు ఇవ్వాలని, మహాలక్ష్మి పథకాన్ని సత్వరమే అమలు చేయాలని వ్యవసాయ కార్మికులు నినదించారు. కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ల ప్లేకార్డులను ప్రదర్శించారు. పెద్ద సంఖ్యలో వ్యవసాయ కార్మికులు తరలిరావడంతో కలెక్టరేట్ వ‌ద్ద‌ ఆందోళనా పూరిత వాతావరణం నెలకొన్నది.

హామీలు అమలు చేయక పోతే పోరాట కార్యక్రమం

రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేయక పోతే ఆందోళన తప్పదని, ప్రజల పక్షాన పోరాట కారాచరణను రూపొందించుకోవడం జరుగుతుందని సి.పి.ఐ జాతీయ సమితిసభ్యులు భాగం హేమంతరావు హెచ్చరించారు. ఆందోళనుద్దేశించి సి.పి.ఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ ప్రసంగించగా, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు తాటి వెంకటేశ్వరరావు, సిద్దినేని కర్ణకుమార్, సిపిఐ జిల్లా సహాయకార్యదర్శి జమ్ముల జితేందర్రెడ్డి, సి.పి.ఐ రాష్ట్ర సమితిసభ్యులు యర్రాబాబు, ఏపూరి లతాదేవి, ఎస్.కె. జానిమియా, కొండవర్తి గోవిందరావు, బి.జి.క్లెమెంట్, జిల్లా కార్యవర్గసభ్యులు శింగునర్సింహారావు, పోటు కళాపతి, సి. హెచ్. సీతామహాలక్ష్మి, పగదాల మల్లేష్, వేపూరి రవీంద్రబాబు, దండు ఆదినారాయణ, మేకలశ్రీనివాసరావు, మిడికంటి వెంకటరెడ్డి, ఏనుగుగాంధీ, యానాలి సాంబశివరెడ్డి, కూచిపూడి రవీందర్, ఇటికాల రామకృష్ణ, శాఖమూరి శ్రీనిటవవాసరావు, కాశనబోయిన అయోధ్య, సింగారపు సత్యనారాయణ, గోగుల ఆది, బోడాచీనా, మేళ్ళచెరువు వీరబాబు, పగిళ్ళవీరభద్రం తదితరులు పాల్గొన్నారు. డిమాండ్ల తో కూడిన వినతి పత్రాన్ని అధికారులకు అందచేశారు.

Next Story