- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నో బిల్.....అంతా మోసమే
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొంత మంది హార్వెస్టర్ డీలర్లు మోసానికి పాల్పడుతున్నారు.

దిశ, వైరా: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో కొంత మంది హార్వెస్టర్ డీలర్లు మోసానికి పాల్పడుతున్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా కేంద్రంగా ఈ మోసాలు రోజురోజుకు శృతి మించుతున్నాయి. ఇటీవల మార్కెట్లోకి తాడేపల్లిగూడెంకు చెందిన ఓ డీలర్ ఎస్బీఐ, హెచ్ డీఎఫ్‌సీ బ్యాంకులకు తప్పుడు పత్రాలు సమర్పించి, సుమారు 11 హార్వెస్టర్లకు ఫైనాన్స్ చేయించారు. సదరు డీలర్ డెలివరీ చేసిన హార్వెస్టర్లకు అనేక సమస్యలు వస్తున్నాయి. దీనిపైడీలర్ కు వినియోగదారులు ఫోన్ చేసినా స్పందించడం లేదని తెలుస్తోంది.
షో రూంలో కొనుగోలు చేసిన వస్తువులకు కనీసం బిల్లులు ఇవ్వడం లేదని హార్వెస్టర్ యజమానులు దిశ న్యూస్ తో వాపోతున్నారు. ప్రధానంగా రెండు కంపెనీలు స్పేర్ పార్టుల విషయంలో అసలు కంటే మూడింతలు అధికంగా వసూలు చేస్తున్నట్లు సమాచారం. కృష్ణా జిల్లాకు చెందిన ఒక హార్వెస్టర్ యజమాని తన వద్ద పవర్ బెల్ట్ కోసం రూ.8800 వసూలు చేశారని బహిరంగంగా వ్యాఖ్యానించటం విశేషం. అంతేకాకుండా రూ.700 ఉన్న టెన్షన్ రోలర్ అడ్జస్ట్మెంట్ బోల్టును 1700 రూపాయలకు కంపెనీ విక్రయిస్తోందట. కనీసం బెల్టులు కొన్నందుకు బిల్లులు కూడా ఇవ్వలేదట. ఇప్పటికైనా హార్వెస్టర్ రంగంపై ప్రభుత్వాలు దృష్టి సారిస్తాయో? లేదో ? వేచి చూడాల్సిందే.






