- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రిజర్వేషన్లపై ఉత్కంఠ.. సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో సర్వత్రా ఆసక్తి
సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో చైర్మన్‌లు, వార్డుల రిజర్వేషన్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.

సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో చైర్మన్‌లు, వార్డుల రిజర్వేషన్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కల్లూరు నూతన మున్సిపాలిటీగా అవతరించగా, ఇక్కడ 20వార్డులు, 18,868మంది ఓటర్లు ఉన్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీలో 23వార్డులకు, 28,411మంది ఓటర్లు ఉన్నారు. ఆయా మున్సిపాలిటీలలో ఎవరికి రిజర్వేషన్ అవుతుందోదని ప్రజలలో ఆసక్తి నెలకొంది. ఎవరికి వారే కులాల వారీగా సమీకరణ వేసుకుంటూ ఎప్పటికప్పుడు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే ఓటర్ జాబితా ముసాయిదా విడుదల చేయడంతో ఆశావహుల జాబితాను జల్లెడ పట్టే పనిలో ప్రధాన రాజకీయ పార్టీ రాజకీయ నాయకులు ఉన్నారు. కాగా కల్లూరు మున్సిపాలిటీ మంత్రి పొంగులేటి సొంత మండలం కావడంతో ఇక్కడ ఎన్నికలు ప్రాధాన్యతను సంతరించుకోనున్నది. దిశ, సత్తుపల్లి
దిశ, సత్తుపల్లి : ఖమ్మం జిల్లా సత్తుపల్లి, కల్లూరు మున్సిపాలిటీల్లో చైర్మన్‌లు, వార్డుల రిజర్వేషన్లపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సత్తుపల్లి మాజీ ఎమ్మెల్యే జలగం వెంకట్రావు హయాంలో 2005లో మేజర్ పంచాయతీ నుంచి నగర పంచాయతీగా అప్డేట్ అయింది. తొలిసారి జరిగిన ఎన్నికల్లో మున్సిపల్ చైర్మన్ పదవి ఎస్టీ జనరల్‌గా మహిళలకు అవకాశం కల్పించడంతో పూచి యశోద తొలి చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. 2014లో జరిగిన ఎన్నికల్లో బీసీ మహిళకు రిజర్వ్ కాగా దొడ్డకుల స్వాతి చైర్‌పర్సన్‌గా కొనసాగారు. 2020లో జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో చైర్మన్ జనరల్‌గా రిజర్వ్ కావడంతో కూసంపూడి మహేశ్ చైర్మన్‌గా ఎన్నికై కొనసాగారు. ఈసారి సత్తుపల్లి, నూతనంగా ఏర్పడిన కల్లూరు మున్సిపాలిటీలలో ఎవరికి రిజర్వేషన్ అవుతుందని ప్రజలలో ఆసక్తి నెలకొంది. ఎవరికి వారే కులాల సమీకరణ వేసుకుంటూ ఎప్పటికప్పుడు రాజకీయ విశ్లేషకుల అభిప్రాయాలు సేకరిస్తున్నారు.
నూతన మున్సిపాలిటీగా కల్లూరు..
కల్లూరు మేజర్ పంచాయతీలో ఏడు పంచాయతీలను విలీనం చేయగా 2025లో కల్లూరు నూతన మున్సిపాలిటీగా అవతరించింది. ఈ మున్సిపాలిటీలో 20వార్డులు, 18,868మంది ఓటర్లు ఉన్నారు. కల్లూరు మున్సిపాలిటీ రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత మండలం కావడం కల్లూరు మున్సిపాలిటీ ఎన్నిక ఈసారి ప్రాధాన్యతను సంచరించుకుంది. ఇప్పటికే ఓటర్ జాబితా విడుదల చేయడంతో ఆశావహుల జాబితాను జల్లెడ పట్టే పనిలో ప్రధాన రాజకీయ పార్టీ రాజకీయ నాయకులు ఉన్నారు. తెలంగాణలో 2028నాటికి నియోజకవర్గాల పునర్విభజన పూర్తయితే కల్లూరు నూతన అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పడుతుందని చర్చ జరుగుతున్న నేపథ్యంలో మున్సిపాలిటీపై అధికార ప్రతిపక్ష పార్టీలు ప్రత్యేకంగా దృష్టి సారించాయి.
వార్డుల విభజన..
సత్తుపల్లి మున్సిపాలిటీలో 23వార్డులు, సరిహద్దులు ఈసారి యథాతథంగానే గానే ఉన్నాయి. అయితే ఓటర్ల సంఖ్య పెరగటంతో ఏ వార్డులో ఓట్లు ఏ మేరకు పెరుగుతాయా అంటూ రాజకీయ పార్టీలు అంచనా వేసుకుంటున్నారు. 2020ఎన్నికల్లో 26, 471ఓట్లు ఉండగా.. ఈసారి 28,411మంది ఓటర్లు ఉన్నారు. 1940ఓట్లు పెరిగాయి. సత్తుపల్లి 13వ వార్డులో గతంలో అత్యధికంగా 1780ఓట్లతో పెద్ద వార్డుగా ఉండగా, ఈసారి1923 ఓట్లు పెరిగాయి. సత్తుపల్లిలో 28, 411మంది. ఓటర్లకు 23వార్డులుగా విభజన జరిగింది. కల్లూరులో 18,886 మంది ఓటర్లు ఉండగా 20వార్డులుగా విభజన జరగగా ఇటీవల ఓటరు జాబితా ముసాయిదా వెలువడగా, రాజకీయ పార్టీలు ఎన్నికలకు సిద్ధమవుతున్నాయి.
కొమ్మేపల్లిలో 429మందికి ఓట్లు హక్కు లేనట్లేనా?..
సత్తుపల్లి సింగరేణి ఓపెన్ కాస్ట్ విస్తరణలో భాగంగా రీ హ్యబిటేషన్ కింద కొమ్మెపల్లి గ్రామాన్ని పూర్తిగా తీసుకున్నారు. వారికి సత్తుపల్లి పట్టణం అయ్యగారిపేట రెవెన్యూ 71లో 226కుటుంబాలకు పునరావాసం కల్పించారు. కొమ్మేపల్లి గ్రామం ఏర్పడి దాదాపు ఆరేళ్లు కావొస్తున్నా సత్తుపల్లి మున్సిపాలిటీకి విలీనం చేయకపోవడంతో 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కిష్టారం పంచాయతీ లో 206పోలింగ్ బూత్ కింద రెండో వార్డుగా 429మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో కొమ్మేపల్లి గ్రామంలో ఉన్న రెండో వార్డులోని 429ఓటర్లను తొలగించారు. అటు కొమ్మేపల్లి పంచాయతీలో ఇటు సత్తుపల్లి మున్సిపాలిటీలో ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం లేకుండా పోతుందని ఇటీవల కాలనీవాసులు జిల్లా కలెక్టర్, తహసీల్దార్ ఎంపీడీఓలను కలిసి వినతి పత్రాలు సమర్పించారు.






