- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పదో తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ కిట్లు అందజేత
మండలంలోని గోల్ తండా శివారు జింకలగూడెం గ్రామానికి చెందిన సయ్యద్ మదర్ సాహెబ్ మరణించారు.

దిశ,తిరుమలాయపాలెం: మండలంలోని గోల్ తండా శివారు జింకలగూడెం గ్రామానికి చెందిన సయ్యద్ మదర్ సాహెబ్ మరణించారు. దీంతో తన తండ్రి పేరున కుమారుడు సయ్యద్ ఇమామ్ సయ్యద్ మదర్ సాహెబ్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి నిరుపేదలకు,తల్లిదండ్రులు లేని అనాథ పిల్లలకు,విద్య,వైద్యం మొదలగు సేవ కార్యక్రమాలు ట్రస్ట్ ద్వారా అందిస్తున్నారు. మొన్నవర్షకాలం వచ్చిన వరదలకు ఆకేరుపొంగి,రకాసితండా వాసులు నిరాశ్రయులు కాగా..ట్రస్ట్ చైర్మన్ ఇమామ్ సుమారు రూ.1లక్ష వరకు ట్రస్ట్ ద్వారా నిత్యవసర సరుకులు,సహాయ సహకారాలు అందించారు. అందులో భాగంగానే..జల్లేపల్లి ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్ష రాసే విద్యార్థిని విద్యార్థులకు,మదర్ సాహెబ్ ట్రస్ట్ ద్వారా పరీక్ష కిట్లు అందించారు. సోమవారం ట్రస్ట్ కో-చైర్మన్ సయ్యద్ సిలార్ ఆధ్వర్యంలో.. జరిగిన ఈ కార్యక్రమంలో మండల ఎస్సై కూచిపూడి జగదీశ్,ఎంఈఓ శ్రీనివాసరావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. 60 మంది పదో తరగతి విద్యార్థిని,విద్యార్థులకు పరీక్ష ప్యాడ్,జామిటర్ బాక్స్,పెన్నులకు సంబంధించిన కిట్లు అందించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెడ్మాస్టర్ రాజేష్, ట్రెజరర్ సైదా,ట్రస్ట్ సభ్యులు చందు,సైదా,ఇమామ్,అమీర్, జాఫర్,అమీర్,సైదా,ఉబేద్, తదితరులు పాల్గొన్నారు.






