- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సుభాష్ నగర్ మాజీ సర్పంచ్ అదృశ్యం
దిశ, ఇల్లెందు : ఇల్లందు మండలం సుభాష్ నగర్ పంచాయితీ బీఆర్ఎస్ మాజీ సర్పంచ్, వల్లాల మంగమ్మ శుక్రవారం రాత్రి నుంచి కనబడటం లేదు. భర్త వల్లాల నరసయ్య తెలిపిన వివరాల ప్రకారం..

దిశ, ఇల్లెందు : ఇల్లందు మండలం సుభాష్ నగర్ పంచాయితీ బీఆర్ఎస్ మాజీ సర్పంచ్, వల్లాల మంగమ్మ శుక్రవారం రాత్రి నుంచి కనబడటం లేదు. భర్త వల్లాల నరసయ్య తెలిపిన వివరాల ప్రకారం.. మాజీ సర్పంచ్ ప్రస్తుత సర్పంచ్ అభ్యర్థి వల్లాల మంగమ్మ శుక్రవారం రాత్రి అదృశ్యమైంది. నిన్న రాత్రి నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని తమ బంధువుల తెలిసిన వాళ్ళ ఇళ్లల్లో సైతం చూసామని ఆచూకీ తెలియడం లేదంటూ పేర్కొన్నారు. ఇవాళ ఇల్లందు పోలీస్ స్టేషన్ లో సైతం మిస్సింగ్ కేస్ కింద కేసు నమోదు చేశామని పేర్కొన్నారు. తమకు ఇంట్లో ఎటువంటి కలహాలు లేవని అంతా బాగానే ఉంటున్నామని తమకు ఎవరితోనూ శత్రుత్వం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి సర్పంచ్ అభ్యర్థిగా సైతం పోటీ చేయనున్న వల్లాల మంగమ్మ ఎన్నికల నేపథ్యంలో డిసెంబర్ 03వ తేదీ నామినేషన్ వేసే క్రమంలో అనుమానాస్పదంగా కనిపించకపోవడం సర్వత్ర ఆశ్చర్య అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మాజీ సర్పంచ్ వల్లాల మంగమ్మ అదృశ్యమైందనే విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్ చార్జి మాజీ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ సుభాష్ నగర్ లోని మంగమ్మ ఇంటికి చేరుకొని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కుటుంబ సభ్యులు సైతం మంగమ్మ ఆచూకీ తెలియకపోవడంపై ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు హరిప్రియ తెలిపారు. సర్పంచ్ ఎన్నికల్లో వల్లాల మంగమ్మ గెలుపు ఖాయమని ఈ నేపథ్యంలో రాజకీయంగా ఏమైనా కుట్రలు జరుగుతున్నాయా అనే విషయంపై ఇల్లెందు మండలంలో సర్వత్ర చర్చనీయాంశమైంది. ఏది ఏమైనా వల్లాల మంగమ్మ మిస్సింగ్ విషయంపై పోలీసులు సైతం విచారిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే రాజకీయ ఎత్తుగడల్లో భాగంగా వల్లాల మంగమ్మను బెదిరింపులకు గురిచేసినట్లయితే ఉపేక్షించేది లేదంటూ ఎంతటి ఎవరికైనా పోరాటం చేస్తామని పూర్తి వివరాలతో రేపు విలేకరుల సమావేశం ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఇటు మాజీ సర్పంచ్ వల్లాల మంగమ్మ భర్త వల్లాల నరసయ్య సైతం తాము బీఆర్ఎస్ పార్టీలోనే కొనసాగుతామని స్పష్టం చేశారు.






