సత్తుపల్లిలో ఎన్నికలకు సర్వం సిద్ధం..

by Batti.Sumithra |

సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు సత్తుపల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీవో అశోక చక్రవర్తి తెలిపారు.

సత్తుపల్లిలో ఎన్నికలకు సర్వం సిద్ధం..
X

దిశ, సత్తుపల్లి : సత్తుపల్లి నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాటు చేసినట్లు సత్తుపల్లి ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్డీవో అశోక చక్రవర్తి తెలిపారు. సత్తుపల్లి నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 2,43,118 గాను, పురుషులు 1.18 885, మహిళలు 1.24 225, ఇతరులు, 8 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ఇందుకుగాను నియోజకవర్గ వ్యాప్తంగా ప్రాంతాలు 162, పోలింగ్ కేంద్రాలు 292, ఎన్నికల సూక్ష్మ పరిశీలకులుగా 56 మంది, ఎన్నికల పర్యవేక్షణ కోసం 20 మందితో వెబ్ కాస్టింగ్ ఏర్పాటు, 27 రూట్లో 120 వాహనాలతో పాటు పోలీస్ భద్రత కోసం 584 మందితో పాటు ఎన్నికల నిర్వహణ అధికారులు 1868 మంది సిబ్బందిని ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

నియోజకవర్గ వ్యాప్తంగా 36 ప్రాంతాల్లో 81 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించినట్లు 5 మోడల్ పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు, నియోజకవర్గ వ్యాప్తంగా 100% వెబ్ కాస్టింగ్ జరుగుతుందని, సత్తుపల్లి నియోజకవర్గ ఓటర్లు ఎటువంటి భయాందోళన లేకుండా ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన తెలిపారు. పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు.

Next Story