ఎన్నిక‌ల కోడ్ ఉందా..? లేదా..?

by Nallavelli.Anjaneyulu |

దిశ‌, కారేప‌ల్లి రూర‌ల్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం గ్రామ‌పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న

ఎన్నిక‌ల కోడ్ ఉందా..?  లేదా..?
X

దిశ‌, కారేప‌ల్లి రూర‌ల్ : తెలంగాణ రాష్ట్రంలో ప్ర‌స్తుతం గ్రామ‌పంచాయ‌తీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. దీంతో గ్రామ‌పంచాయ‌తీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. కారేపల్లి మండల పరిధిలోనిపలు గ్రామపంచాయతీలలో ఎన్నికల కోడ్ అమల్లో ఉందా ..? లేదా ..?అనే అనుమానం కలుగుతుంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులో ఉన్నా వైన్స్ షాపుల నుండి బెల్టు షాపుల నిర్వాహకులు గ్రామాల్లోని బెల్ట్ షాపులకు, బైకుల ద్వారా యధేచ్చగా మద్యం తీసుకు వెళ్తూ మారుమూల ప్రాంతాల్లో మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. అన్ని విషయల్లో కోడ్ ను అమలు చేస్తున్న అధికారులు మద్యం విషయంలో మీనమేషాలు లెక్కిస్తూ లోపాయికారంగా వైన్స్ యాజమాన్యానికి సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

కోడ్ నిరంతరం నిఘా ఉన్నప్పటికీ ఎక్సైజ్, పోలీస్ శాఖల అధికారులు ఎన్నికల డ్యూటీలో గస్తీ కాస్తున్నా ఇంత ఈజీగా బెల్ట్ షాపులకు మద్యం సరఫరా ఎలా అవుతుందని? 24×7 బెల్ట్ షాపుల ద్వారా మద్యం విక్రయాలు ఎలా జరుగుతున్నాయని ప్రజలు మహిళలుప్రశ్నిస్తున్నారు. గ్రామీణ,పట్టణ ప్రాంతాల్లో దాదాపు ప్రతి కిరాణా షాపు ఒక బెల్ట్ షాపుగా మారి ఎమ్మార్పీ ధరలకు మార్కెట్లో దొరకాల్సిన మద్యాన్ని రూ.30 నుండి రూ. 50వరకు అధిక ధరలకు విక్రయిస్తున్నా ఎవరూ నోరు మెదపకుండా చోద్యం చూస్తూ ఉండిపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అప్పుడప్పుడు చుట్టపు చూపుగా వచ్చి అడపాదడపా ఒకటి రెండు కేసులు నమోదు చేస్తున్నారని, కానీ అందరికీ తెలిసే అధికారికంగా బెల్ట్ దందా జోరుగా నడుస్తుందని మద్యం ప్రియులే బహిరంగంగా మాట్లాడుకుంటున్నారు. మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో బెల్ట్ షాపుల దందా జోరుగా సాగుతుంది. బెల్టు దుకాణాలకు మద్యం సరఫరా పై నిరంతరం ఏది ..? ఎలక్షన్‌ కోడ్‌ అమల్లో ఉన్నప్పుడు అన్ని రకాల కార్యకలాపాలు ఎన్నికల సంఘం నియంత్రణలోకి వస్తాయి. రోడ్లపై వాహనాలను తనిఖీ చేస్తూ నగదు, తదితరాలను నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తే సీజ్‌ చేసే అధికార యంత్రాంగం, బెల్ట్‌ షాపులకు మద్యం సరఫరా అవుతున్న ఎందుకు ఫోకస్‌ చేయడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.కోడ్‌ ఉండటంతో పరిమితంగా మాత్రమే తీసుకెళ్లడానికి అనుమతి ఉంటుంది.అడ్డూ అదుపు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా వైన్స్‌ల నుంచి మద్యం, బీర్లు బహిరంగంగానే మారుమూల ప్రాంతాల్లోని బెల్ట్‌ షాపులకు తరలిపోతుందంటే నియంత్రణ నిఘ ఎలా ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చు.

బెల్టు షాపులు ఉండే ప్రాంతాలు ఇవే :

కారేపల్లి నియోజకవర్గం, మండల కేంద్రంలో కొన్ని గ్రామపంచాయతీ ప్రాంతాలలో బెల్ట్ షాపులు కొనసాగుతున్న ప్రాంతాలు మండల కేంద్రంలో పెట్రోల్ బంక్, సినిమా టాకీస్ సమీప ప్రాంతాలలో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా వెలిశాయి. ఎల్లవేళలా ఇక్కడ మద్యం అందుబాటులో ఉంటుందని మద్యం ప్రియులే వాపోతున్నారు.ఇక మండలంలో భాగ్యనగర తండా, సూర్య తండ ఉసిరికాయలపల్లి చీమలపాడు,సీతారాంపురం లావుడియా తండా తదితర గ్రామపంచాయతీలలో బెల్ట్ నిర్వాహకులు కోడి కూత కూయకముందే మద్యం విక్రయాలు జరుపుతున్నారు. ఎక్సైజ్ కను సన్నల్లోనే వ్యవహారం..? ఎక్సైజ్‌ అధికారుల కనుసన్నల్లోనే మద్యం దందా జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. నియోజకవర్గ వ్యాప్తంగా ఎన్నో బెల్టు షాపులు వెలిసినా ఎక్సైజ్‌ అధికారులు ఏం చేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి గ్రామపంచాయతీలలో జోరుగా బెల్టు ద్వారా మద్యం విక్రయాలుజరుగుతున్నాయని తెలిసి కూడా చర్యలు తీసుకోవడం లేదని ప్రచారం జరుగుతున్నది. అధికారులు స్పందించి బెల్టు దందాను అడ్డుకోవాలని పల్లెల్లోని ప్రజలు మహిళలు కోరుతున్నారు. కారేపల్లి ఎక్సైజ్ శాఖ సీఐ ఎం. ప్రశాంతి వివరణ కోరగా.. కారేపల్లి కామేపల్లి మండల పరిధిలో బెల్ట్ షాపులలో విక్రయిస్తున్న10,000 విలువచేసే మధ్యాన్ని స్వాధీనం చేసుకొని ఇప్పటికే ముగ్గురిపై కేసు నమోదు చేశాం. ఎన్నికల కోడ్ అమలులో ఉన్న క్రమంలో గ్రామాలలో ఎవరైనా బెల్ట్ షాపులలో మధ్య విక్రయించిన చట్టపరమైన చర్యలు తప్పవని తెలిపారు.

Next Story