- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్కౌంటర్...విప్లవ ద్రోహుల పనే
by Sridhar Babu |
కరకగూడెం మండలంలో జరిగిన ఎన్కౌంటర్ విప్లవ ద్రోహుల పనేనని పేర్కొంటూ భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజన్ మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఆజాద్ ఒక లేఖను విడుదల చేశారు.

X
దిశ, భద్రాచలం : కరకగూడెం మండలంలో జరిగిన ఎన్కౌంటర్ విప్లవ ద్రోహుల పనేనని పేర్కొంటూ భద్రాద్రి కొత్తగూడెం, అల్లూరి సీతారామరాజు డివిజన్ మావోయిస్టు పార్టీ కార్యదర్శి ఆజాద్ ఒక లేఖను విడుదల చేశారు. ఈ ఎన్కౌంటర్లో డివిజన్ కమిటీ సభ్యులు లచ్చన్న తో పాటు ఆరుగురు కామ్రేడ్స్ మృతి చెందినట్లుగా ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్న హత్యలను ప్రజలు గమనిస్తూనే ఉన్నారని, ఇటువంటి వాటికి మావోయిస్టు పార్టీ భయపడదని పేర్కొన్నారు. రఘునాథపాలెం ఎన్కౌంటర్కు నిరసనగా ఈనెల తొమ్మిదో తేదీన జిల్లా బంద్కు ఆయన పిలుపునిచ్చారు. రఘునాథపాలెం ఎన్కౌంటర్ను ప్రజలు, ప్రజాస్వామిక వాదులు ఖండించాలని కోరారు. గురువారం నాటి ఎన్కౌంటర్లో చనిపోయిన వారు లచ్చన్న, తులసి, రాము, కోసి, గంగాల్,దుర్గేష్ లతోపాటు ఒక గ్రామస్తుడు ఉన్నట్టు పేర్కొన్నారు.
- Tags
- Maoist
Next Story






