‘విద్యుత్ అంబులెన్స్’ ప్రారంభం

by velandi.Saikiran |

అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసమే ‘విద్యుత్ అంబులెన్స్’ ను ప్రారంభించినట్లు జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసాచారి

‘విద్యుత్ అంబులెన్స్’ ప్రారంభం
X

దిశ, ఖమ్మం రూరల్ : అంతరాయం లేని విద్యుత్ సరఫరా కోసమే ‘విద్యుత్ అంబులెన్స్’ ను ప్రారంభించినట్లు జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ శ్రీనివాసాచారి అన్నారు. బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీ వరంగల్క్రాస్ రోడ్డు పరిధిలో గల విద్యుత్ శాఖ ఏర్పాటు చేసిన ‘విద్యుత్ అంబులెన్స్’ను ఎస్ఈ ప్రారంభించారు. ఈ వాహనం పాలేరు డివిజన్ ప్రజలతో పాటు, ముదిగొండ మండలానికి సైతం ఉపయోగపడుతుందని ఆయన తెలిపారు. విద్యుత్ అంబులెన్స్ అనేది విద్యుత్ అంతరాయాలు ఏర్పడినప్పుడు అత్యవసర సేవలు అందించడానికి ఉపయోగపడే వాహనం అని అన్నారు. 1912 అనే హెల్ప్‌లైన్‌ నంబర్‌కు కాల్ చేసి సేవ‌లు వినియోగించుకోవాల‌న్నారు. ఈ కార్యక్రమంలో డీఈ సీహెచ్ నాగేశ్వరరావు, డీఈ భద్రుపవర్, ఏడీఈ బీ. రామక్రిష్ణ, ఏఈ ప్రభాకర్రావు, ఫోర్మెన్, లైన్మెన్లు, ఇతర సిబ్బంది ఉన్నారు.

Next Story