- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వైరా కు 5వేల ఇళ్ల మంజూరుకు కృషి చేయాలి
వైరా నియోజకవర్గం అభివృద్ధి కోసం అసెంబ్లీలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ గళం ఎత్తారు.

దిశ, వైరా : వైరా నియోజకవర్గం అభివృద్ధి కోసం అసెంబ్లీలో ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ గళం ఎత్తారు. గత పదేళ్ల పాలనలో ప్రజలకు కనీస మౌలిక సదుపాయాలను ఆ ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో.. వైరా నియోజకవర్గ ప్రజలు విస్తు చెందారని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాన్నారు. కాంగ్రెస్ పాలనలో అన్ని పథకాల కంటే.. శిఖర స్థానంలో నిలిచిందని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల పథకం తో.. నియోజకవర్గ ప్రజలు సంతోషంగా ఉన్నారన్నారు. గత ఏడాది 3500 ఇల్లు నియోజకవర్గంలో మంజూరు చేయడం జరిగిందని.. కనీస అవసరమైన గూడు కల్పించిన ప్రభుత్వ పనితీరుపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. రెండో దశ ఇందిరమ్మ ఇళ్ళల్లో వైరా నియోజకవర్గంలో.. ఐదువేల ఇల్లు అవసరం ఉందని ఆ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని ఇళ్ల మంజూరుకి ప్రాధాన్యత కోసం ఎమ్మెల్యే విన్నవించారు. గత పాలనలో డబల్ బెడ్ రూమ్ ఇల్లు అసంపూర్ణంగా మిగిలిపోయాయని.. 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో దాని తాలూకా పనులకు సంబంధించి అధికారులతో ఎస్టిమేట్లు వేయించి డబల్ బెడ్ రూమ్ ఇల్లును పూర్తి చేస్తామని అసెంబ్లీ సాక్షిగా ఆయన పేర్కొన్నారు.






