- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కాంగ్రెస్‌తో పొత్తు కోసం చివరిక్షణం వరకు ప్రయత్నం- సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్
కాంగ్రెస్‌తో పొత్తు రాష్ట్ర స్థాయిలో ఉంటుందని ఆశీస్తున్నామని, దాని కోసం చివరి క్షణం వరకు ప్రయత్నం చేస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ అన్నారు.

దిశ, ఖమ్మం రూరల్: కాంగ్రెస్‌తో పొత్తు రాష్ట్ర స్థాయిలో ఉంటుందని ఆశీస్తున్నామని, దాని కోసం చివరి క్షణం వరకు ప్రయత్నం చేస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ అన్నారు. బుధవారం ఏదులాపురం మున్సిపాలిటీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రశ్నించే పార్టీగా ప్రజల పక్షాన నిలుస్తున్న సిపిఐ పార్టీ అభ్యర్థులను ప్రజలు ఆశీర్వదించాలని సిపిఐ జిల్లా కార్యదర్శి దండి సురేష్ విజ్ఞప్తి చేశారు. పంచాయతీ వ్యవస్థ ఏర్పడిన నాటి నుంచి ప్రజల ఆధార, అభిమానాలతో భారత కమ్యూనిస్టు పార్టీ ఎదులాపురం అభివృద్ధిలో కీలకంగా పని చేసిందన్నారు.
మున్సిపాలిటీలోనూ ప్రజల పక్షాన అండగా నిలుస్తూ డివిజన్లను అభివృద్ధి పథంలో నడిపిస్తామన్నారు. కావున ప్రజలు కంకి కొడవలి గుర్తుపై ఓటు వేసి నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరారు. ఈ ప్రాంతంలో ఇండ్లు ఇండ్ల స్థలాలు లేక నిరుపేదలు ఎన్నో ఏళ్లుగా ఇబ్బందులు పడుతున్నారన్నారు. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పెద్ద మనసుతో అటువంటి నిరుపేదలకు న్యాయం చేయాలన్నారు. తమకు బలం ఉన్న ప్రాంతాల కోసం చివరి క్షణం వరకు పొత్తుల్లో ప్రయత్నం చేసినట్లు తెలిపారు. ఇప్పటికీ రాష్ట్రస్థాయిలో సిపిఐ-కాంగ్రెస్కు ఉన్న మైత్రినే కొనసాగిస్తారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు, అభ్యర్థులు , యువజన సంఘం సభ్యులు , మహిళా సమైక్య సభ్యులు పాల్గొన్నారు.






