దిశ కథనంతో కదిలిన విద్యాశాఖ.. కే.వీ.పాఠశాల యాజమాన్యానికి ఎంఈఓ నోటీసు

by Kodari Anjali |

కారేపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్‌లో ప్రభుత్వ గుర్తింపు(రికగ్నైజేషన్)లేకుండా కె.వి. పాఠశాల నిర్వహిస్తున్నారంటూ దిశ దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనం విద్యాశాఖ అధికారులను కదిలించింది.క

దిశ కథనంతో కదిలిన విద్యాశాఖ.. కే.వీ.పాఠశాల యాజమాన్యానికి ఎంఈఓ నోటీసు
X

దిశ, కారేపల్లి: కారేపల్లి మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్‌లో ప్రభుత్వ గుర్తింపు(రికగ్నైజేషన్)లేకుండా కె.వి. పాఠశాల నిర్వహిస్తున్నారంటూ దిశ దినపత్రికలో శుక్రవారం ప్రచురితమైన కథనం విద్యాశాఖ అధికారులను కదిలించింది. కథనంపై స్పందించిన జిల్లా విద్యాశాఖ అధికారులు, మండల విద్యాశాఖ అధికారి (ఎంఈఓ) జయరాజు వెంటనే విచారణ చేపట్టి పాఠశాల యాజమాన్యానికి నోటీసు జారీ చేశారు. రెండు సంవత్సరాలుగా అవసరమైన ప్రభుత్వ గుర్తింపు(రికగ్నైజేషన్)లేకుండానే పాఠశాల కొనసాగుతున్నట్లు గుర్తించిన అధికారులు, పది రోజులలోపు అన్ని అనుమతులు పొందాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు తప్పనిసరిగా ఆటస్థలం, మౌలిక వసతులు కల్పించడంతో పాటు భవనానికి సంబంధించి బిల్డింగ్ కండిషన్ సర్టిఫికేట్ సహా అన్ని నిబంధనలు పూర్తి చేయాలని ఆదేశించారు. నిర్దేశించిన గడువులోగా ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా అన్ని అనుమతులు సమర్పించకపోతే పాఠశాలను సీజ్ చేయడంతో పాటు చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నోటీసులో హెచ్చరించినట్లు ఎంఈఓ జయరాజు దిశకు తెలిపారు. ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకువస్తూ బాధ్యతాయుతమైన జర్నలిజానికి నిదర్శనంగా నిలుస్తున్న దిశ కథనంతో అధికారులు వెంటనే స్పందించి చర్యలకు దిగడం స్థానికంగా దిశ పత్రికను అభినందించారు.

Next Story