- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కుటుంబ కలహాలతో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం.. !
కుటుంబ కలహాలతో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో సంచలనం రేపింది.

దిశ-బూర్గంపాడు : కుటుంబ కలహాలతో డ్రైవర్ ఆత్మహత్యాయత్నం చేసుకున్న ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలో సంచలనం రేపింది. వివరాల్లోకి వెళ్లితే.. సారపాకలోని మేడే కాలనీకి చెందిన లాకవత్ వెంకన్న గతంలో ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. మెరుగైన ఉపాధి కోసం కుటుంబంతో కలిసి హైదరాబాద్‌కు వలస వెళ్ళాడు. అక్కడ కారు డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గత కొంతకాలంగా భార్య ప్రవర్తనలో మార్పు రావడం.. ఆమె వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని తెలియడంతో కుటుంబంలో గొడవలు మొదలయ్యాయి.
వేధింపులు భరించలేక..
భార్య అక్రమ సంబంధాన్ని నిలదీసినందుకు, ఆమె సదరు వ్యక్తితో కలిసి తనపై అక్రమ కేసులు పెట్టించిందని, పోలీసులు కూడా వారికే సహకరిస్తున్నారని వెంకన్న ఆరోపించాడు. తన పిల్లలను కూడా తనకి దూరం చేశారని, బతుకుపై విరక్తి కలిగిందని ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక సెల్ఫీ వీడియో రికార్డ్ చేశాడు. అందులో తన గోడును వెళ్లగక్కుతూనే, కళ్లముందే పురుగుల మందు సేవించాడు.వెంకన్న ఆత్మహత్యాయత్నాన్ని గమనించిన కుటుంబ సభ్యులు,స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ని భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన అక్కడ చికిత్స పొందుతున్నారు.ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. బాధితుడు ఆరోపించినట్లుగా వేధింపుల వెనుక అసలు కారణాలు ఏమిటనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు.






