- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నూతన సంవత్సర వేడుకల్లో ఇతరులకు ఇబ్బంది కలిగించవద్దు : సీఐ సాగర్
దిశ, కారేపల్లి : నూతన సంవత్సర వేడుకల ద్వారా ఇతరులకు ఇబ్బంది కలగకూడదని, వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సింగరేణి సీఐ నునావత్ సాగర్, ఎస్సై బైరు గోపి తెలిపారు.

దిశ, కారేపల్లి : నూతన సంవత్సర వేడుకల ద్వారా ఇతరులకు ఇబ్బంది కలగకూడదని, వేడుకలను ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని సింగరేణి సీఐ నునావత్ సాగర్, ఎస్సై బైరు గోపి తెలిపారు. పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వారు మాట్లాడారు. నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మండల ప్రజలందరికీ వారు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ డిసెంబర్ 31న రాత్రి సమయంలో గ్రామాలలో రహదారులపై వేడుకలు నిషేధించబడ్డాయని తెలిపారు. మద్యం తాగి వాహనాలను నడపవద్దని, మితిమీరిన వేగంతో ద్విచక్ర వాహనాలు నడిపి ప్రమాదాలకు గురై తల్లిదండ్రులను క్షోభకు గురిచేయవద్దన్నారు. మద్యం దుకాణదారులు నిర్ణీత సమయం వరకే విక్రయాలు చేయాలన్నారు. అర్ధరాత్రి గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తే సహించేది లేదన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రతి గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.స్నేహపూర్వక వాతావరణంలో శుభాకాంక్షలు తెలుపుకోవాలని విద్యార్థులు, యువతకు సూచించారు. డీజేలకు అనుమతి లేదని, బాణసంచా కాల్చడంపై నిషేధం ఉంటుందని తెలిపారు. నూతన సంవత్సర వేడుకల్లో గంజాయి సేవించిన విక్రయించిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కారేపల్లి బస్టాండ్ సెంటర్లో డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తామని తెలిపారు. వైన్ షాపులు నిర్దేశిత సమయానికి మూసివేయాలని, మైనర్లకు మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. మైనర్లకు వాహనాలు ఇచ్చే యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అర్థరాత్రి యువకులు నిర్లక్ష్యంగా అధిక వేగంతో వాహనాలు నడపకుండా, బైక్ రేసులు జరగకుండా గ్రామాలలో రాత్రి మొత్తం పెట్రోలింగ్ కొనసాగుతుందని తెలిపారు.






