- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆసుపత్రుల్లో వైద్య సేవలతో పాటు పరిపాలన పై వైద్యులు దృష్టి సారించాలి
ఆసుపత్రుల్లో వైద్య సేవలతో పాటు పరిపాలన పై వైద్యులు దృష్టి పెట్టాలని కలెక్టర్ దివాకర టిఎస్ సూచించారు. క

దిశ, ఖమ్మం : ఆసుపత్రుల్లో వైద్య సేవలతో పాటు పరిపాలన పై వైద్యులు దృష్టి పెట్టాలని కలెక్టర్ దివాకర టిఎస్ సూచించారు. కలెక్టర్ దివాకర టీఎస్ గురువారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజతో కలిసి జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ పనితీరుపై సమీక్షించారు. కలెక్టర్ దివాకర టీఎస్ మాట్లాడుతూ.. జిల్లా వ్యాప్తంగా నమోదవుతున్న రోజు వారీ ఓపీ, ప్రభుత్వ ఆసుపత్రుల్లో జరుగుతున్న ప్రసవాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రుల్లో పనిచేయని యంత్రాలు ఏవైనా ఉంటే వెంటనే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యలను పరిష్కరించాలని తెలిపారు. అన్ని ఆసుపత్రుల్లో ఉన్న పరికరాల పనితీరుపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధుల నియంత్రణ లో భాగంగా ప్రతి పీహెచ్‌సీ స్థాయిలో అవసరమైన ల్యాబ్ పరీక్షా సామగ్రి ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని సూచించారు.
జిల్లాలో మెరుగైన అత్యవసర వైద్య సేవల కోసం అదనంగా ఒక 108 వాహనం, రెండు 102 వాహనాలు అవసరమని అధికారులు సమావేశంలో తెలిపారు. పాముకాటు నివారణ మందులు అన్ని పీహెచ్‌సీల్లో తగిన నిల్వలో ఉన్నాయని అధికారులు వివరించారు. జిల్లాలో అందుబాటులో ఉన్న వైద్య వనరులు, వైద్యుల సంఖ్య, మెరుగుపర్చాల్సిన వైద్య సేవలపై సమగ్ర నివేదిక ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ప్రతి గర్భిణీ మహిళకు వంద శాతం ఏఎన్‌సీ నమోదు జరిగేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు. హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ లక్ష్యాలను పూర్తిగా చేరుకోవాలని సూచించారు. ఆశా, ఏఎన్‌ఎం లకు స్పష్టమైన లక్ష్యాలు నిర్దేశించాలని, 14 నుండి 15 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలికల తల్లిదండ్రులను ప్రతి ఆశా కార్యకర్త స్వయంగా సంప్రదించి వ్యాక్సిన్ వేయించేలా చూడాలని ఆదేశించారు. ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు క్షేత్ర స్థాయిలో విస్తృతంగా పర్యటిస్తూ పనిచేయాలని, ఎన్‌సీడీతో పాటు ఇతర ఆరోగ్య సూచికలపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించాలని సూచించారు.
వైద్యులు వైద్య సేవలతో పాటు పరిపాలనా బాధ్యతలను కూడా సమర్థంగా నిర్వహించాలని కలెక్టర్ పేర్కొన్నారు.ఖమ్మం జిల్లాపై ప్రజల అంచనాలు ఎక్కువగా ఉన్నాయని, వాటిని అందరూ సమిష్టిగా నెరవేర్చాలని తెలిపారు. వైద్యులు తప్పనిసరిగా సమయపాలన పాటించాలని, ఆసుపత్రుల్లో అనవసర గందరగోళానికి తావులేకుండా చూడాలని సూచించారు. *ఒక వైద్యుడు డ్యూటీ ముగించేముందు మరో వైద్యుడు ఆసుపత్రికి చేరుకున్న తర్వాతే వెళ్లాలని, డాక్టర్ అందుబాటులో లేరు అనే పరిస్థితి ఎక్కడా రాకూడదని స్పష్టం చేశారు. ఆసుపత్రులకు అవసరమైన ప్రాథమిక ఫర్నిచర్ పూర్తిగా అందజేస్తామని కలెక్టర్ తెలిపారు. వైద్యులు, ఆసుపత్రి సిబ్బంది రోగులతో ఓర్పుతో, మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని, కఠిన పదజాలం ఉపయోగించకుండా మృదువుగా మాట్లాడాలని సూచించారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి. శ్రీజ మాట్లాడుతూ ఆసుపత్రుల్లో అవసరమైన మరమ్మతులు, ఫర్నిచర్‌కు సంబంధించిన అంచనాలను గురువారం నాటికి సమర్పించాలని అధికారులను ఆదేశించారు. కొనుగోలు వ్యయం లక్ష లోపు ఉండే విధంగా ప్రతిపాదనలు రూపొందిస్తే కోటేషన్ ద్వారా నేరుగా కొనుగోలు ప్రక్రియ చేపట్టవచ్చని సూచించారు. ఈ సమావేశంలో జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రామారావు, అదనపు డీఎంహెచ్‌ఓ చందు నాయక్, ఎన్‌సీడీ పీవో డాక్టర్ అరుణాదేవి, డీఐఓ డాక్టర్ పి. సంపత్, ఐడీఎస్పీ పీవో డాక్టర్ ఐ. మోత్యా, వైద్యులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.






