- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మంటల్లో పంటలు.. అవశేషాలకు నిప్పుతో అనర్థాలు
చిన్నపాటి పాటి తప్పిదం పంటలను బుగ్గి చేస్తున్నాయి. ప్రజలను ప్రమాదంలో పడేస్తున్నాయి. ఆకతాయిలు లేదా, రైతులు పంట పొలాల్లో అవశేషాలకు పెడుతున్న నిప్పు అగ్నిప్రమాదాలకు దారితీస్తున్నాయి. క్షణాల్లోనే తోటలు, గడ్డి మేడలు, పశువుల షెడ్లు, ఇళ్లను చుట్టుముట్టి ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది.

చిన్నపాటి పాటి తప్పిదం పంటలను బుగ్గి చేస్తున్నాయి. ప్రజలను ప్రమాదంలో పడేస్తున్నాయి. ఆకతాయిలు లేదా, రైతులు పంట పొలాల్లో అవశేషాలకు పెడుతున్న నిప్పు అగ్నిప్రమాదాలకు దారితీస్తున్నాయి. క్షణాల్లోనే తోటలు, గడ్డి మేడలు, పశువుల షెడ్లు, ఇళ్లను చుట్టుముట్టి ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. అనేక గ్రామాల్లో పొలాల్లో వేసిన మంటలు అదుపుతప్పి పామాయిల్ తోటలు, వరిపొలాలు, వ్యవసాయ పరికరాలు పూర్తిగా దగ్ధమైన ఘటనలు చోటుచేసుకుంటూనే ఉన్నాయి. అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే లక్షల రూపాయల ఆస్తి నష్టం వాటిల్లుతున్నది. మరోవైపు వ్యవసాయశాఖ, పోలీస్ శాఖ పంటపొలాల్లో మంటలు పెట్టకుండా రైతులకు ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తున్నారు. - దిశ, ఖమ్మం రూరల్
దిశ, ఖమ్మం రూరల్ : పాలేరు నియోజకవర్గంలోని గ్రామీణ ప్రాంతాల్లో పంట కోతల అనంతరం పొలాల్లో మొండికాళ్లు, ఎండిన గడ్డి, పంట వ్యర్థాలకు నిప్పంటించే ఘటనలు రోజురోజుకూ పెరుగుతుండగా, ఈ చిన్నపాటి నిర్లక్ష్యం భారీ అగ్నిప్రమాదాలకు దారితీస్తున్నాయి. ఒక చిన్న మంట క్షణాల్లోనే తోటలు, గడ్డి మేడలు, పశువుల షెడ్లు, ఇళ్లను చుట్టుముట్టి ప్రజల్లో భయాందోళనలు కలిగిస్తోంది. ఇటీవల అనేక గ్రామాల్లో పొలాల్లో వేసిన మంటలు అదుపుతప్పి పామాయిల్ తోటలు, వరి మేడలు, వ్యవసాయ పరికరాలు పూర్తిగా దగ్ధమైన ఘటనలు చోటుచేసుకున్నాయి. కొన్ని చోట్ల మంటలు గ్రామ శివార్ల నుంచి ఇండ్ల వరకు వ్యాపించడంతో రాత్రంతా భయంతో గడిపిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
ఖమ్మం రూరల్ మండలంలోని గోళ్లపాడు గ్రామంలో పదెకరాల పామ్అయిల్ తోట అగ్నికి అహూతి కావడంతో లక్షల్లో నష్టం వాటిల్లింది. అగ్నిమాపక సిబ్బంది చేరుకునేలోపే లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. ఆరెంపుల, తిరుమాలయపాలెం మండలం, కూసుమంచి మండంలం, నేలకొండపల్లి మండలాల్లో పంటలకు నిప్పటించడంతో నష్టంతో పాటు భూసారం గణనీయంగా దెబ్బతిన్నదనే ఆందోళన వ్యక్తమవుతున్నది. పొగ కారణంగా చిన్నారులు, వృద్ధులు శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. పంట వ్యర్థాలను కాల్చడంతో భూమిలోని సూక్ష్మ జీవులు నశించి భూమి సారవంతత కూడా దెబ్బతింటోందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
విస్తృతంగా అవగాహన
గ్రామాల్లో వరుసగా అగ్నిప్రమాదాలు జరుగుతున్న తరుణంలో వ్యవసాయశాఖ ఏడీఏలు, ఏఓలు, ఏఈఓలు గ్రామాల్లో విరివిరిగా అవగహన సదస్సులు నిర్వహిస్తున్నారు. పొలాల్లో పంట వ్యర్థాలను కాల్చకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నారు. పంట వ్యర్థాలను ఎరువుగా మార్చే పద్ధతులపై అవగాహన కల్పిస్తున్నారు.
పంట అవశేషాల కాల్చితే పరవ్యవరణానికి ముప్సు
పాలేరు డివిజన్ ఏడీఏ సతీశ్
వ్యవసాయ పనులు పూర్తయ్యాక రైతులు పొలాల్లో మిగిలిపోయిన పంట అవశేషాలను తగులబెట్టడం ఇటీవల గ్రామీణ ప్రాంతాల్లో అధికమవుతోంది. ఈ చర్యలతో పర్యావరణానికి, భూసారానికి తీవ్ర నష్టం కలుగుతోంది. పంట అవశేషాలను కాల్చితే నేలలోని నైట్రోజన్, ఫాస్పరస్, పొటాషియం వంటి పోషకాలు నశించడంతో పాటు ఉపయోగకర సూక్ష్మజీవులు, వానపాములు నశిస్తాయి. భూమి సారం తగ్గి పంట దిగుబడులపై ప్రభావం పడే అవకాశం ఉంది. వ్యర్థాల దహనంతో గాలిలో విషపూరిత పొగలు వ్యాపిస్తాయి. పంట అవశేషాలు నేలలో కలపడం, పశుగ్రాసంగా వినియోగించడం, కంపోస్ట్ తయారీ, బయో డీకంపోజర్ వినియోగం వంటి ప్రత్యామ్నాయ పద్ధతులను రైతులు పాటించాలి.






