నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు..

by I. Sairam |

మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం పరిశీలించారు.

నామినేషన్ కేంద్రాన్ని సందర్శించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు..
X

దిశ, కొత్తగూడెం: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కొత్తగూడెం మున్సిపల్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన నామినేషన్ల ప్రక్రియను జిల్లా ఎస్పీ రోహిత్ రాజు శుక్రవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కేంద్రాల వద్ద విధులల్లో ఉన్న పోలీసు అధికారులు, సిబ్బందికి పలు సూచనలు చేశారు. నామినేషన్ కేంద్రాల పరిసరాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అప్రమత్తంగా విధులు నిర్వర్తించాలని, అభ్యర్థులు మరియు వారి అనుచరులు ఎన్నికల నియమావళిని కచ్చితంగా పాటించేలా చూడాలని ఎస్పీ ఆదేశించారు.

గుంపులు గుంపులుగా రావడం, నినాదాలు చేయడం, ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపడతామని తెలియజేశారు. సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణ, మెటల్ డిటెక్టర్లు, బారికేడ్లు, ట్రాఫిక్ నియంత్రణ వంటి భద్రతా చర్యలను సమర్థవంతంగా అమలు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ ఎన్నికల నేపథ్యంలో ప్రజలకు ఎలాంటి సమస్యలు ఎదురైనా వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు. జిల్లాలో శాంతియుత,స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణకు పోలీస్ శాఖ పూర్తిగా కట్టుబడి ఉందని జిల్లా ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు.

Next Story