- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఖండాంతరాలకు వ్యాపించిన దిశ కథనాలు.. సంగతేంటో తెలుసా..?

దిశ, కొత్తగూడెం : గంగారం రెవెన్యూ పరిధిలో భూమాఫియా అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి . దీంతో ఈ ముఠా సభ్యులకు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. అధికారులను తప్పుదోవ పట్టించి,పోర్జరీ సంతకాల ఆధారంగా నకిలీ పట్టా పాస్ పుస్తకాల దందా ఆధారాలతో సహా బయటకు వస్తుండడంతో.. ఈ ముఠా సభ్యులు ఏం చేయాలో పాలు పోక తమని కాపాడమని కొంతమంది ప్రజా ప్రతినిధుల ఇళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారని సమాచారం. ఇప్పటికే ఇంటెలిజెన్స్ అధికారులు , కేటీపీఎస్ విజిలెన్స్ అధికారులు కేటీపీఎస్ డి.ఈ, ఆయన సతీమణి, కుటుంబ సభ్యులు తో సహా ఈ ముఠా సభ్యుల కదలికల పై, వీరు చేస్తున్న అక్రమ దందాపై,గత పది సంవత్సరాలు గా ముఠా చేస్తున్న ఆగడాల పై పూర్తిస్థాయిలో నివేదిక తయారు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. 'దిశ'పత్రికలో ఈ అంశంపై వరుస కథనాలు ప్రచురితం కావడంతో ..గంగారం రెవెన్యూ పరిధిలోని భూములకి అసలైన పట్టాదారు కొండపల్లి గోపాల్ రావు మనవడు కొండపల్లి రాజగోపాల్ కిషన్ అమెరికా నుండి ఈ భూమాఫియా అక్రమ ముఠాపై చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ని, ఎస్పీని అమెరికా నుండి వీడియో ద్వారా విజ్ఞప్తి చేశారు.
పదుల సంఖ్యలో బాధితులు
కేటీపీఎస్ డిఈ,అతని భార్య, మాజీ రౌడీ షీటర్,స్థానికుడి ముఠా బారిన పడిన బాధితులు ఒక్కొక్కరుగా బయటికి వస్తున్నారు. 1970 సంవత్సరం కంటే ముందు నుండి కొండపల్లి గోపాల్ రావు వద్ద నుండి కొనుగోలు చేసిన భూములపై ఈ అక్రమార్కులు నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి ఆగడాలకు తెగబడుతున్నారు. ఇటీవల సంపత్ నగర్ గ్రామానికి ఒక మహిళ 25 ఎకరాల భూమిపై కే.టీ.పి. ఎస్,డి.ఈ సతీమణి నకిలీ పత్రాలు సృష్టించి వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. కేటీపీఎస్ డీఈ సతీమణి,కెటీపీఎస్ డి ఈ , కెటీపీఎస్ డి.ఈ మరొక కుటుంబ సభ్యురాలు వేర్వేరుగా సంపత్ నగర్ లోని ఒక వ్యక్తి కి చెందిన 30 ఎకరాల భూమిపై నకిలీ డాక్యుమెంట్లను సృష్టించి వారిని వేదించి బ్లాక్మెయిల్ చేస్తున్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు.
అదేవిధంగా భద్రాచలంకి చెందిన 20 ఎకరాల భూమి కొనుగోలు చేయిస్తామని చెప్పి ఓ డాక్టర్ వద్ద 5 లక్షల రూపాయలు అడ్వాన్స్ గా తీసుకుని మోసం చేసి ఇప్పటివరకు భూమి చూపించడం లేదని తెలుస్తోంది. అలాగే ముఠా సభ్యుడైన స్థానికుడు , స్థానికుడి కుటుంబ సభ్యురాలు కలిసి సంపత్ నగర్ కి చెందిన ఒకే రైతుకు చెందిన 40 ఎకరాల భూమిపై నకిలీ పట్టా పాస్ పుస్తకాలను తయారుచేసి ఫోర్జరీ డాక్యుమెంట్లతో, అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారు. కేటీపీఎస్ డి.ఈ ఒక వృద్ధ రైతుకి చెందిన 12 ఎకరాల భూమిపై, అదే గ్రామానికి చెందిన మరో మహిళకి చెందిన 30 ఎకరాల భూములపై ఇదే పద్ధతిలో నకిలి నాన్ జ్యుడీషరీ స్టాంప్ పేపర్లను సృష్టించి అసలు రైతులను వేధింపులకు గురి చేస్తున్నారు. కొత్తగూడెం చెందిన ఒక ప్రముఖ వైద్యుడు వద్ద నుంచి భూమి ఇప్పిస్తామని ఇదే భూమాఫియా ముఠా సుమారు 25 లక్షల వరకు వసూలు చేసి ముఖం చాటేస్తున్నట్టు సమాచారం. ఇవన్నీ కేవలం గత ఆరు నెలలుగా వీళ్ళు చేసిన అక్రమాలు , గత పది ఏళ్ల నుండి ఈ ముఠా చట్టంలోని చిన్నచిన్న లొసుగులను అడ్డం నిజమైన రైతులని, వృద్ధులని విపరీతమైన వేధింపులకు గురి చేస్తున్నారు. అధికారులు స్పందించి ఈ ముఠాపై చర్యలు తీసుకోకపోతే ఆత్మహత్యే శరణ్యమని రైతులు వాపోతున్నారు.
ఫోర్జరీ ముఠా సభ్యుల వెనక అదృశ్యశక్తి
నకిలీ పత్రాలు తయారు చేసి ఫోర్జరీ చేసే ముఠా బాగోతాలు ఆధారాలతో సహా బయటపడడంతో, ముఠా సభ్యులు గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. ప్రజా ప్రతినిధుల ఇళ్ల చుట్టూ తమను కాపాడాలని ప్రదక్షణలు చేస్తున్నట్లు తెలుస్తుంది. సదరు ప్రజాప్రతినిధికి చెందిన ఒక అదృశ్య శక్తి వీరికి అభయం ఇచ్చినట్లు సమాచారం. ఏం జరిగినా నేను చూసుకుంటానని అదృశ్య శక్తి వద్ద హామీ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఈ నకిలీ భూదందా లో ఈ అదృశ్య శక్తి కి కూడా వాటా ఉందేమో అని గ్రామస్తులు అనుమాన పడుతున్నారు. పూర్తి ఆధారాలు సేకరించి జిల్లా ఎస్పీకి, కలెక్టర్కు వీరు చేస్తున్న మోసాలపై ఫిర్యాదు చేసేందుకు బాధిత రైతులంతా కలిసి ఒక తాటిపైకి వస్తున్నారు. త్వరలోనే ఫిర్యాదు చేస్తామంటున్నారు.దీంతో భూమాఫియా ముఠా సభ్యులైన కేటీపీఎస్ డీఈ,మాజీ రౌడీషీటర్, స్థానికులతో సహా ముఠా సభ్యులు ఏం చేయాలో పాలుపోక ఎలాగైనా ఈ సమస్య నుంచి బయట పడాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.
నిజమైన రైతులను కాపాడండి :కొండపల్లి రాజగోపాల్ కిషన్, అమెరికా వాస్తవ్యుడు
1970 ముందు గంగారం గ్రామంలోని భూములకి మా తాత కొండపల్లి గోపాల్ రావు పట్టాదారు. ఆ సమయంలోనే మా తాత,నాన్న వెంకట రామారావు స్థానికంగా ఉండే రైతులకు భూములను విక్రయించారు. ఇప్పుడు ఈ భూములు తమయని కొందరు నకిలీలు రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు దిశ పత్రిక ద్వారా తెలుసుకున్నాను. ఈ అంశంపై జిల్లా ఎస్పీ, కలెక్టర్ స్పందించి రైతులను కాపాడాలని కోరుకుంటున్నాను. వారి భూములు వారికి చెందే విధంగా చర్యలు చేపట్టాలని కోరుకుంటున్నాను. అసలైన రైతులు తీవ్ర మనోవేదన కి గురవుతున్నారు.