- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
దిశ ఎఫెక్ట్ : ప్రభుత్వ స్థలంలో పాగా వాస్తవమే!
: ప్రభుత్వ జాగా.. వేసెయ్ పాగా అనే శీర్షకను సొమవారం ‘దిశ’ దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కథనానికి స్పంధించిన రెవెన్యూ, సర్వే అధికారులు అక్రమిత భవనాలను వారు పరిశీలించారు. కథనానికి స్పంధించిన తహసీల్దార్ పిల్లి రాంప్రసాద్ ఆదేశాల మేరకు ఆర్ఐ ప్రసాద్, సర్వేయర్ సతీష్రెడ్డిలు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు.

దిశ ఎఫెక్ట్ : ప్రభుత్వ స్థలంలో పాగా వాస్తవమే!
‘దిశ’ కథనంతో కదిలిన రెవెన్యూ అధికారులు
సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తామని ప్రకటన
దిశ, ఖమ్మం రూరల్ : ప్రభుత్వ జాగా.. వేసెయ్ పాగా అనే శీర్షకను సొమవారం ‘దిశ’ దినపత్రికలో కథనం ప్రచురితమైన విషయం తెలిసిందే. కథనానికి స్పంధించిన రెవెన్యూ, సర్వే అధికారులు అక్రమిత భవనాలను వారు పరిశీలించారు. కథనానికి స్పంధించిన తహసీల్దార్ పిల్లి రాంప్రసాద్ ఆదేశాల మేరకు ఆర్ఐ ప్రసాద్, సర్వేయర్ సతీష్రెడ్డిలు క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. సర్వే నెం. 142 అసైన్మెంట్ ల్యాండ్ అని, 120 సర్వే నెం పట్టా భూమి అని తెల్చారు. ఎంత వరకు అక్రమణకు గురైందని విషయాన్ని పూర్తి రికార్డుల పరిశీలన తరువాత తెలుపుతామన్నారు. బిల్డింగ్ ధ్రువపత్రాలు, పర్మీషన్ పత్రాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ తీసుకుని తహసీల్దార్ కార్యాలయంలో హజరుకావాలని ఆర్ఐ నిర్వహకుడికి చరవాణి ద్వారా తెలిపారు. అక్రమించినవారు ఎంతటివారైన సహించేదిలేదని పై అధికారుల ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.
అక్రమణలను వెలికితీయాలి
ప్రభుత్వ ల్యాండ్ను పక్కనే ఉన్న రెండు అపార్ట్మెంట్లతో పాటు ఖాళీ ప్లాట్లు యజామానులు సైతం అక్రమించినట్లు అధికారులు గుర్తించారు. గుర్తించిన వాటిని వెలికితీయాల్సిన బాధ్యత అధికారుల పైనే ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు. బైపాస్కు దగ్గర ఉన్న విలువ గల భూమి స్వాదీనం చేసుకుని ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.






